స్టే ఎలా వచ్చిందంటే..

This way chandrababu Naidu got stay on ACB Court Judgement

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో తను అనుకున్నది కొంతమేర సాధించారు. ఓటుకు నోటు కేసులో ఆళ్ల రామకృష్ణ వేసిన పిటిషన్ పై స్పందించిన ఏసీబీ హైకోర్టు కేసు విచారించాలని ఆదేశించింది. సెప్టెంబర్ 29లోపు కేసు విచారణ పూర్తి చేసి తమకు రిపోర్ట్ చెయ్యాలని ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది. కాగా దీనిపై చంద్రబాబు నాయుడు తరఫు క్వాష్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు గురువారం(1 సెప్టెంబర్, 2016) చేశారు. ఆళ్ల రామకృష్ణ వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే ఇస్తూ తీర్పును శుక్రవారం(2సెప్టెంబర్ 2016) వెల్లడించింది. కాగా ఆళ్ల రామకృష్ణ మాత్రం ఈ విషయంలో తగ్గేది లేదని, చంద్రబాబు నాయుడు అసలు రంగును బయటపెడతామని వెల్లడించారు.

కాగా ఆళ్ల రామకృష్ణ వేసిన పిటిషన్ కు స్పందించిన ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే ఇస్తూ తీర్పును వెల్లడించింది. అసలు చంద్రబాబు నాయుడు తరఫు లాయరు ఎలా ఈ స్టే తీసుకువచ్చారు అన్న దానిపై తెలుగోడ పూర్తి వివరాలు మీ కోసం..

– రామకృష్ణ వేసిన పిటిషన్ కాపీ చంద్రబాబు నాయుడికి అందలేదు.(వాస్తవానికి చంద్రబాబు నాయుడి పేరు లేని కారణంగా ఆ కాపీలను చంద్రబాబుకు ఇవ్వాల్సిన అవసరంలేదు)
– ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యేకు అర్హత లేదు. ఈ కేసులో ఆయన సాక్షి కూడా కాదు. (కాగా హైకోర్టు అనర్హుడిగా ప్రకటించలేదు)
– తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు, చంద్రబాబుకి ఎలాంటి సంబంధం లేదు.
– ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉంది. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి చంద్రబాబుపై ఒక సంవత్సరం తర్వాత పిటిషన్ వేయడం సరికాదు. (ఈ కేసు క్రైం నెంబర్ 11 కు ఎటువంటి ఆటంకం లేదు)
– ఫోన్ సంభాషణలు, బహిరంగ ప్రసంగాలు, ఇంటర్య్యూలు ఆధారాలుగా చూపించడం సరికాదు. (ఇదే సాక్షాలతో ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది)
– ఏసీబీ కోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధం. (కౌంటర్ దాఖలు చేసుకునే వెసలుబాటు కల్పించింది)
– క్రిందికోర్టు దర్యాప్తుకు ఆదేశించిన కారణాలు ఉత్తర్వుల్లో వివరించలేదు.

పై కారణాలను చంద్రబాబు తన పిటిషన్‌లో పేర్కొనడంతో.. ‘ఓటుకు నోటు’ కేసుపై ‘స్టే’ లభించింది. అది కూడా 8 వారాలు స్టే ఇవ్వడం జరిగింది. ఈలోపు.. ఫిర్యాదుదారుడు రామకృష్ణని కౌంటర్ దాఖలు చేసుకోవచ్చునని తెలిపింది. ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన కేసులో స్టే తెచ్చుకున్నారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
ఆ సిఎంను చూడు బాబు...
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
పవన్ పంచ ప్రశ్నలు
ఛాయ్‌వాలా@400కోట్లు
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?

Comments

comments