ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్

Those telgudesamparties recognisation cancelled

టైటిల్ చూసి తెలుగుదేశం పార్టీకి ఏమైంది? అసలు ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీని ఎలా రద్దు చేస్తుంది? అని అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ చర్చ మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి కాదు. అంటే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించి కాదు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా? ఆ మధ్యన నందమూరి హరికృష్ణ, లక్ష్మీపార్వతిలు తెలుగుదేశం పార్టీ పేరు వచ్చే రెండు పార్టీలను స్థాపించారు కదా. వాటి గురించి కేంద్ర ఎన్నికల సంఘం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీవ్ర నిర్ణ‌యం తీసుకుంది. త‌న నిర్ణ‌యంతో నంద‌మూరి హ‌రికృష్ణ‌, ల‌క్ష్మీపార్వ‌తిల‌కు షాకిచ్చింది. గ‌త ప‌దేళ్లుగా ఏ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌ని పార్టీల గుర్తింపు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఈసీ ప్ర‌క‌టించింది. 2005 నుంచి 2015 వ‌ర‌కూ ప‌దేళ్ల కాలంలో ఎన్నిక‌ల క్షేత్రంలో కాలుమోప‌ని పార్టీల అంతు చూసింది. దేశ‌వ్యాప్తంగా 255 రాజ‌కీయ పార్టీల గుర్తింపును ఏక కాలంలో ర‌ద్దు చేసేసింది. ఈ ర‌ద్ద‌యిన పార్టీల జాబితాలోనే నంద‌మూరి హ‌రికృష్ణ‌కు చెందిన అన్న తెలుగుదేశం పార్టీ… ల‌క్ష్మీపార్వ‌తికి చెందిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలు కూడా ఉన్నాయి. వీటికి తోడు మ‌రో 10 పార్టీలు తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తింపును కోల్పోయాయి.

ఈసీ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల్లోని 12 పార్టీలు ఇవే..

ఆల్ ఇండియా సద్గుణ పార్టీ
ఆంధ్రనాడు పార్టీ
అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ)
బహుజన రిపబ్లికన్ పార్టీ
భారతీయ సేవాదళ్
జై తెలంగాణ పార్టీ
ముదిరాజ్ రాష్ట్రీయ సమితి
నేషనల్ సిటిజన్స్ పార్టీ
ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి)
సత్యయుగ్ పార్టీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
తెలంగాణ ప్రజా పార్టీ

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
సింగ్ ఈజ్ కింగ్
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
వాళ్లను వదిలేదిలేదు
పిహెచ్‌డి పై అబద్ధాలు
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
అకౌంట్లో పదివేలు వస్తాయా?
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
చెబితే 50.. దొరికితే 90
అమ్మను పంపించేశారా?
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments