ఆ రెండు బాణాలు మోదీ వైపే..?

Those two weapons targets Nerandra Modi

ఏపికి ప్రత్యేక హోదా కోసం నిరసన గళాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజ్యసభలో ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ కు ప్రభుత్వం నుండి ప్రతికూలంగా స్పందన రావడం.. కేంద్రం ప్రత్యేక హోదా కాకుండా మిగిలిన వాటిపై దృష్టిసారించాలని స్పష్టం చెయ్యడం ఉద్రిక్తతలకు దారితీసింది. మోదీ సర్కార్ ను అన్ని రకాలుగా ఇబ్బందిపెట్టడానికి ఏపి నుండి ప్లాన్ సిద్దమవుతోంది. రాజ్యసభలో ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ కు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు ఆందోళనకు సిద్దమయ్యారు తెలుగు తేజాలు.

ముందు నుండి కేంద్రం చేత ప్రత్యేక హోదాపై సానుకూలంగా కాకున్నా.. దాదాపుగా ప్రత్యేక హోదా కల్పిస్తే కలిగే అన్ని ప్రయోజనాలను కల్పించేలా చంద్రబాబు సర్కార్ చేస్తుంది అనే ఓ నమ్మకం ఉండేది. కానీ పరిస్థితి మారింది.కేంద్ర సర్కార్ వాయిస్ మారింది. రాజ్యసభలో మిత్రపక్షం నుండి దెబ్బ ఉంటుంది అని కూడా ఆలోచించకుండా అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు రకరకాలుగా ప్రకటనలు చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా గేర్ మార్చినట్లు కనిపిస్తోంది. పార్లమెంట్లో జరిగిన చర్చ తర్వాత టిడిపి అనుసరించాల్సిన వైఖరిపై చంద్రబాబు సీరియస్ గా స్పందించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. నిధులు లేవని తెలిసి కేంద్రం ఎందుకు రాష్ట్రాన్ని విభజించారు అని మండిపడ్డారు. కాగా ఇక్కడ గమనించాల్సినఅ అంశం ఏంటంటే.. చంద్రబాబు నాయుడు నిన్నటి దాకా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చే సూచనలు లేవని తెలిసినా కూడా ఎక్కడా కూడా సీరియస్ గా కష్టపడిన సందర్భాలు లేవు. పైగా ప్రతిపక్షాలు దీనిపై నిలదీస్తే మాత్రం ప్రత్యేక హోదా ఒక్కటే అన్నింటికి మార్గం కాదు అని అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి దాపురించింది.

దాంతో చేసేదేం లేక టిడిపి ప్రజాప్రతినిధులతో చర్చించి  మోదీ సర్కార్ ను ప్రత్యేక హోదా అంశంలో ఇబ్బంది పెట్టాల్సిందే అని అన్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దిల్లీలో ధర్నాకు దిగారు. మోదీ సర్కార్ మీద చంద్రబాబు సర్కార్ అనుకున్న రీతిలో వత్తిడి చెయ్యలేకపోతోందని.. అందుకే ప్రత్యేక హోదాపై హామీని పొందలేకపోతోందని  ఓ వాదన వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గల్లా జయదేవ్, సుజనా, అశోక గజపతిరాజులాంటి సీనియర్ నాయకులను, పార్లమెంట్ లో బాగా మాట్లాడే కింజరపు రామ్మోహన్ నాయుడులాంటి వాళ్లు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు వాళ్లను ఇప్పుడు ఎలా వాడతారు అన్నది చూడాలి.

ఇక ప్రత్యక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అలజడికి కారణమైన వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి, కేవీపీ వ్యవహరిస్తున్న తీరు ఒకే టైంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ను, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు సర్కార్ ను టార్గెట్ గా చేశారు. రేపు(ఆగష్టు2) ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చారు.

మొత్తంగా కేంద్రంలో తాము నమ్ముకున్న మోదీ సర్కార్ తమను పరోక్షంగా దెబ్బతీస్తున్న సందర్భంగా యుద్దానికి దిగుతోంది. వైసీపీ కూడా మోదీ సర్కార్ ను టార్గెట్ చేసింది. దాంతో ఏపి నుండి చంద్రబాబు నాయుడు సంధించిన బాణం, వైసీపీ అధినేత జగన్ సంధించిన బాణం కూడా మోదీపైకే చేరుతున్నాయి. ఏపికి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న ఈ యుద్దంలో చివరకు విజయం తెలుగు వారి పక్షాన చేరుతుందా అనేది చూడాలి.

Related posts:
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
సింధూరంలో రాజకీయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
పట్టిసీమ వరమా..? వృధానా..?
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మూడింటికి తేడా ఏంటి..?
వెనకడుగు
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
చెత్త టీంతో చంద్రబాబు
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments