బ్యాంకులకు మూడు రోజులు సెలవులు

Three days holidays for Banks

అసలే కరెన్సీ కష్టాలు ఓ లెవల్లో ఉన్నప్పుడు బ్యాంకులకు సెలవులు అంటే జనానికి హడలే. నేటి నుండి వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నేటి నుండి సోమ‌వారం వ‌ర‌కు క‌రెన్సీ క‌ష్టాలు త‌ప్ప‌వు. అస‌లే పెద్ద నోట్ల ర‌ద్ద వ్య‌వ‌హారంతో రోడ్డున ప‌డ్డ సామాన్యుడు మూడురోజుల పాటు బ్యాంకులు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో మ‌నీ క‌ష్టాలు తారాస్థాయికి చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ రోజు నాలుగో శ‌నివారం కావ‌డంతో బ్యాంకుల‌కు సెల‌వు దినం. రేపు ఆదివారం.  కేంద్ర‌ప్ర‌భుత్వం పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ సోమ‌వారం అంటే 28వ తేదీన‌  భార‌త్ బంద్‌కు విప‌క్షాలు పిలుపునివ్వ‌డంతో ఆ రోజు బ్యాంక్ కార్య‌క‌లాపాల‌కు బ్రేక్ ప‌డ‌నుంది. దీంతో ప్ర‌జ‌లకు తీవ్ర ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అభిప్రాయం నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు.

ఓ వైపు ఎక్క‌డ చూసిన మూత‌బ‌డిన ఏటీఎంలు ద‌ర్శ‌న‌మిస్తుండ‌టం, మ‌రోవైపు కేంద్రం క‌రెన్సీపై రోజుకో ప్ర‌క‌ట‌న చేస్తుండ‌టంతో స‌త‌మ‌తమ‌వుతున్నారు సామాన్య ప్ర‌జ‌లు. ఇదిలా ఉంటే మూడు రోజుల నుంచి బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఒక‌వేళ న‌గ‌దు ఉన్నా 3వేల నుంచి 4వేల‌కు మించి బ్యాంక్ అధికారులు డ‌బ్బులు ఇవ్వ‌డం లేదు. చేతిలో డ‌బ్బుల్లేక ఈ మూడురోజులు గ‌డిచేదెలా అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు ప్ర‌జ‌లు.

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
‘స్టే’ కావాలి..?
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
సల్మాన్ ను వదలని కేసులు
దిగజారుతున్న చంద్రబాబు పాలన
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
అకౌంట్లో పదివేలు వస్తాయా?
తెలంగాణ 3300 కోట్లు పాయె
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
ఛాయ్‌వాలా@400కోట్లు
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments