అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే

TMC MLA Sudip Roy snatches Speaker's mace in Tripura Assembly

అవును..టైటిల్ లో ఎలాంటి తప్పులులేవు. అసెంబ్లీ సాక్షిగా ఓ ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే దొంగతనం చేయడం వార్తల్లో నిలుస్తోంది. అయినా ఎమ్మెల్యేకు ఏం దొరకడంలేదా ఏంటి? మరీ స్పీకర్ ముందు ఉండే గదను దొంగతనం చేయడం ఏంటి అని కూడా అనుకునే వాళ్లున్నారు. అయితే ఆ ఎమ్మెల్యే మాత్రం దొంగతనాల్లో బాగా ఎక్స్ పర్ట్ అన్నట్లు ఒక్కసారిగా స్పీకర్ ముందున్న గదను పట్టుకుని పరుగులంకించాడు. అంతే అక్కడున్న వాళ్లలో చాలా మంది షాక్ తింటే.. మరికొందరు మాత్రం నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏ అసెంబ్లీలో ఈ తతంగం జరిగిందో తెలుసా?

త్రిపుర శాసనసభ శీతాకాల సమావేశాల్లో గందరగోళం నెలకొంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు సుదీప్‌ బర్మన్‌.. స్పీకర్‌ బల్లపై ఉన్న గదను తీసుకుని బయటకు పరుగెత్తాడు. మంత్రి నరేష్‌ జమాతియా తనను బెదిరింపులకు గురిచేశారంటూ ఓ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. దీనిపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. అయితే దీనిపై చర్చకు స్పీకర్‌ నిరాకరించడంతో విపక్ష సభ్యులు సభలో పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో సుదీప్‌ బర్మన్‌ వెంటనే స్పీకర్‌ బల్లపై ఉన్న గదను తీసుకుని పరుగెత్తాడు. కొందరు ఆయన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా తప్పించుకుని బయటకు వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ సిబ్బంది ఆయన నుంచి గదను స్వాధీనం చేసుకుని స్పీకర్‌కు అప్పగించారు.

Related posts:
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
మా టీవీ లైసెన్స్ లు రద్దు
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
నయీం బాధితుల ‘క్యూ’
కాశ్మీర్ భారత్‌లో భాగమే
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
సల్మాన్ ను వదలని కేసులు
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
మోదీ ప్రాణానికి ముప్పు
తెలంగాణ 3300 కోట్లు పాయె
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
వార్దాకు వణికిపోతున్న చెన్నై
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
డబ్బు మొత్తం నల్లధనం కాదు
గుదిబండగా మారిన కోదండరాం
నరేంద్రమోదీ@50 రోజులు
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments