మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు

Tribute to the Indian Soldier with a poem

Tribute to the Indian Soldier with a poem. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

మనకు మంచి చేస్తే వాళ్లను ఎప్పటికీ గుర్తించుకుంటాం. మనకు సంబంధంలేని వ్యక్తులు మన కోసం తమ ప్రాణాలను బలిస్తున్నా కానీ వార్తల్లో చూసి, పేపర్లో చదివి పాపం అని వదిలేస్తున్నాం. కేవలం  జెండావందనం నాడు, క్రికెట్ స్టేడియంలో మాత్రమే గుర్తుకు వచ్చే మన దేశభక్తి నిజంగా అభినందనీయం. క్రికెట్ టీం ఓడిపోతోంది అంటే అదేదో భారత్ పరువుపోతోంది అన్నట్లు చాలా ఫీలవుతాం. అదే యుద్ధంలో మన సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు అన్న వార్తకన్నా.. పక్క పేపర్లో హీరోయిన్ బికినీ ఫోటో మీదనే మన దృష్టి ఉంటుంది.

కోట్ల మంది ప్రాణాలను కాపాడడానికి, కాటికి పోతానని తెలిసినా కాళ్లు వెనక్కి తిప్పని ఆ వీరుడి కోసం..

మా ప్రాణాల కోసం ప్రాణం అడ్డేసిన వీరుడా..
రక్తంమడుగులో ప్రాణం విడిచిన ధీరుడా..
చావులోనూ పిడికిలి బిగించిన ధీవరా..
మమ్మల్ని క్షమించు..
మమ్మల్ని మన్నించు..

మేం కోట్లలో ఉన్నా మీ సాటిలేరుమాకెవ్వరు..
కోటల్లో రాజభోగాలతో కులికే..
రక్షణ కోసం మీ రాజభోగాలను త్యాగం చేసిన వీరులారా..
మమ్మల్ని క్షమించు..
మమ్మల్ని మన్నించు..

వార్తల్లో మీ చావు వార్తలు చదివి నిమిషం కూడా బాధపడని..
మీ రాకకోసం ఎదురుచూసే వాళ్ల కోసం ఆలోచించని..
దేశమంటే మీరు మాత్రమే మేము కాదని ఆలోచించే..
మమ్మల్ని క్షమించు..
మమ్మల్ని మన్నించు..

కప్పుకొట్టుకువస్తే కోట్లిచ్చే..
ఎలక్షన్లో గెలిస్తే డప్పులు కొట్టే..
జైలు నుండి తిరిగొచ్చే నీచులకు జైజైలు కొట్టే..
మమ్మల్ని క్షమించు..
మమ్మల్ని మన్నించు..

మీ కోరికలను చంపుకొని..
మా రక్షణ నెత్తినెత్తుకొని..
కనిపించని ప్రాంతంలో ప్రాణాలొదిలిన.. వీర జవానులారా..
మమ్మల్ని క్షమించు..
మమ్మల్ని మన్నించు..

దేశం కోసం ప్రాణాలు విడిచినా..
కనీసం కొవ్వొత్తి కూడా వెలిగించలేని అసమర్థులను..
వీలైతే క్షమించు..
మమ్మల్ని మన్నించు..

     -Abhinavachary

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
ఆ అద్భుతానికి పాతికేళ్లు
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
జీఎస్టీ బిల్ కథ..
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ప్రత్యేక హోదా లాభాలు
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మెరుపు దాడి... నిజమా-కాదా?
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
కాపీ క్యాట్ పవన్.. జగన్‌ను ఫాలో అవుతున్న జనసేనాని
పిట్టల దొరను మించిన మాటల దొర
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
పవన్ క్షమాపణలు చెప్పాలి
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments