ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్

tripura govt decided to provide roads for Deepa Karmakar

రోడ్ల మీద కార్లు, వెహికిల్స్ తిరుగుతాయనే వాటిని వేస్తారు. కానీ త్రిపుర సర్కార్ మాత్రం ఏకంగా ఓ కారు కోసం రోడ్లను వెయ్యాలని నిర్ణయం తీసుకోవడం వార్తల్లో నిలిచింది. అదేంటి త్రిపుర ప్రభుత్వం అంత నిర్ణయం తీసుకుంది అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అయి ఉంటాడు అని అనుకుంటున్నారేమో? కానీ కాదు. ఆ వ్యక్తి ఒలంపిక్స్ లో మనకు రజతం సంపాదించిన దీపా కర్మాకర్. అవును దీపా కర్మాకర్ కారు కోసం త్రిపుర సర్కార్ రోడ్డు వెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అసలు ఎందుకు అలా నిర్ణయం తీసుకుందో తెలుసా.?

ఒలంపిక్స్ లో దేశానికి పతకం సాధించిన దీపా కర్మాకర్ కు సచిన్ చేతుల మీదుగా బి.ఎమ్.డబ్లు కారు అందించారు. అయితే అగ‌ర్త‌ల‌లోని రోడ్లు స‌రిగా లేవ‌ని, వీటిపై ఇంత ఖ‌రీదైన కారును న‌డ‌ప‌టం సాధ్యం కాదంటూ దానిని తిరిగి ఇచ్చేయాల‌ని దీపా కుటుంబం భావించింది. దానికి స‌మాన‌మైన డ‌బ్బు తీసుకొని, స్థానికంగా దొరికే కారును తీసుకోవాల‌న్న‌ది వాళ్ల ఆలోచ‌న‌. అయితే ఇది త‌మ రాష్ట్రానికి మ‌చ్చ తెచ్చే ప‌ని అని భావించిన అక్క‌డి ప్ర‌భుత్వం వెంట‌నే రంగంలోకి దిగింది. దీపా క‌ర్మాక‌ర్ ఇంటి ద‌గ్గ‌ర‌, స‌మీపంలోని కొన్ని రోడ్లును బాగుచేస్తున్నామ‌ని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి దీపా కర్మాకర్ కారు వల్ల రోడ్లు మాత్రం వస్తున్నాయి. అయినా ప్రభుత్వం తలుచుకుంటే రోడ్లేంటి ఏమైనా వెయ్యగలదు.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
బాబోయ్ బాబు వదల్లేదట
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
ఆటలా..? యుద్ధమా..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
స్థూపం కావాలి
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
బాబు బండారం బయటపడింది
బినామీలు భయపడే మోదీ ప్లాన్
తిరిగిరాని లోకాలకు జయ
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్

Comments

comments