బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం

TRS excellent plan to prevent TDP with BJP

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రాపార్టీ మార్క్ తో టిఆర్ఎస్ టిడిపిని దాదాపుగా ఊడ్చేసింది. మిగిలిన నాలుగురు నాయకులు కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండాలు మోసేందుకు కూడా జనాలు కరువయ్యారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్లకుకట్టినట్లు తెలుస్తోంది. అయితే టిఆర్ఎస్ ముందు నుండి కూడా ఎంతో స్ట్రాటజికల్ గా ముందుకు సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపితో పొత్తుకు ససేమిరా అన్న టిఆర్ఎస్ కేంద్రంలో బిజెపి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది.

తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికలకు ముందే బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ముందే చంద్రబాబు నాయుడు ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగారు. దాంతో ఇప్పుడు టిడిపి, బిజెపిల పొత్తు బాగా కుదిరింది. కాగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వైఖరిపై బిజెపి పై టిడిపి గుర్రుగా ఉంది. ఒకవేళ టిడిపి కేంద్రంలో తమ మద్దతును విరమిస్తే.. దాన్ని టిఆర్ఎస్ వాడుకోవాలని చూస్తోంది.

టిడిపి గనక తమ మద్దతును విరమిస్తే వెంటనే టిఆర్ఎస్ పార్టీ మద్దతునివ్వాలని ప్లాన్ వేస్తోంది. అలా చెయ్యడం ద్వారా కేంద్రం నుండి రాష్ట్రానికి సపోర్ట్ లభించడంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. తెలంగాణలో, ఆంధ్రాలో కూడా తెలుగుదేశం పార్టీకి టిఆర్ఎస్ వల్ల ఇబ్బంది కలిగించే పరిస్థితిని కల్పిస్తోంది. ఇప్పటికే జీఎస్టీ బిల్ కు తమ మద్దతు తెలిపి మోదీ దగ్గర మంచి మార్కులు కొట్టేసిన టిఆర్ఎస్ ఇప్పుడు తమ పని చేసుకుంటూనే టిడిపిని ఎలా దెబ్బతీయాలో అనే పెద్ద స్కెచ్ సిద్దం చేసుకుంది.

Related posts:
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
జీఎస్టీ బిల్ కథ..
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
ఇదే జగ‘నిజం’
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
సింధూరంలో రాజకీయం
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
ఆ అరుపులేంటి..?
ఎవరు చాణిక్యులు..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
మెరుపు దాడి... నిజమా-కాదా?
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే

Comments

comments