ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్

TRS May join with NDA

టీఆర్ఎస్  బీజేపీ గూటికి చేర‌నుంద‌ని ఎప్పటినుంచి క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఎన్డీయేకి జై కొట్టి మంత్రిప‌ద‌వి పుచ్చుకోనుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ ప్ర‌చారం ఇప్పుడు మ‌రింత ఊపందుకుంది. ఓట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో ప్ర‌ధానిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా స‌మ‌ర్ధించ‌డం. ఢీల్లికి వెళ్లి ప్ర‌దానిని క‌ల‌వ‌డం వంటి అంశాలు ఈ ప్ర‌చారానికి మ‌రింత ఊతం ఇచ్చిన‌ట్ల‌యింది.  ఈ నేప‌ధ్యంలో ఎన్డీయే కూట‌మిలోకి టీఆర్ఎస్ చేర‌డం దాదాపు ఖారారైన‌ట్లేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయితే అంద‌రు ఊహించిన‌ట్లుగా క‌విత మంత్రి ప‌ద‌వీని తీసుకోద‌ట‌. ప్ర‌స్తుతం క‌విత టార్గెట్ వేరే ఉంద‌ని టీఆర్ఎస్ క్రీయాశీలక వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించుకునే బాధ్య‌త‌ల్లో క‌విత నిమ‌గ్న‌మై ఉన్నార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టినుంచి పార్టీని ఎన్నిక‌ల‌కు సిద్ధం చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు వివ‌రించారు. మ‌రి బీజేపీ ఇచ్చే ఆఫ‌ర్‌ని టీఆర్ఎస్ ఎవ‌రికి క‌ట్ట‌బెడుతుందో అని అన్ని పార్టీలు చ‌ర్చించుకుంటున్నాయి. కేశ‌వ‌రావు, జితేంద‌ర్ రెడ్డిలకు క‌ట్ట‌బెట్టే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

నిజానికి కేంద్ర‌మంత్రి ప‌దవిలో ఉండ‌టం క‌విత‌కు చిర‌కాల వాంఛ అని కొంద‌రు అంటుంటారు. కానీ ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వుల‌న్నీ కేసీఆర్ కుటుంబానికే ద‌క్కాయ‌ని ఆప‌వాదు ఉంది. ఇక ఇప్పుడు కేంద్ర కేబినేట్‌లో క‌విత‌కు మంత్రి ప‌ద‌వి ఇప్పిస్తే కేసీఆర్ పై స్వార్థ‌ప‌రుడు అనే ముద్ర ఖ‌చ్చితంగా ప‌డుతుంది. అందుకే తెలివిగా వేరే వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేంద్ర‌మంత్రి ప‌ద‌వి క‌న్నా.. పార్టీని గెలిపించే బాధ్య‌త‌లే కీల‌క‌మైన‌వి అని స‌ర్ధుకపోవ‌డ‌మే క‌విత వంతైంది. మొత్తానికి కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లు ఎన్డీయేతో కేసీఆర్ కు లాభమా? నష్టమా? అంటే ఇదే సమాధానం వస్తుంది.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
సల్మాన్ ఖాన్ నిర్దోషి
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
మంత్రుల ఫోన్లు బంద్
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
మోదీ హీరో కాదా?
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
BSNL లాభం ఎంతో తెలుసా?
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
అందుకే భూకంపం రాలేదట
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments