ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి

Truck rams Bastille Day crowd killed 84 People

ఫ్రాన్స్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. నీస్ నగరంలో బాస్టిల్ డే సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఓ ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్లింది. దీంతో 84 మందికి పైగా చనిపోయారు. వందమందికి పైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కు దూసుకెళ్లిన ఘటనను పోలీసులు ఉగ్రదాడిగా భావించారు. ట్రక్కులోని వ్యక్తులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. దీంతో ట్రక్కు బుల్లెట్లతో తూటు పడిపోయింది. ఘటన జరిగిన వెంటనే ఉగ్రవాద వ్యతిరేక దళాలు నీస్ నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కాల్పులు ప్రారంభం కావడానికి ముందే ట్రక్కు డ్రైవర్ తప్పించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. డ్రైవర్ మృతిపై భద్రతాదళాలు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

ట్రక్ వెనుక భాగంలో తుపాకులు, పేలుడు పదార్ధాలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. బాస్టిల్‌డే సంబరాల వీక్షకులను ఢీకొనడానికి ముందు ట్రక్కు అతివేగంతో ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది. వంద మీటర్ల దూరంలో ట్రక్కు వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే వేగంతో వీక్షకులను ఢీకొంది. ఘటన స్థలంలో ఎటుచూసినా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మృతదేహాలు రహదారిపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్టీరోస్ స్పందించారు. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని ఆయన హెచ్చరించారు. ఈ ఘటన దృశ్యాలు ఇస్లామిక్ స్టేట్ మద్దతు వెబ్‌సైట్లలో కనిపించాయి.

Related posts:
నడిరోడ్డు మీద నరుకుతుంటే.. ఏం చేశారో తెలుసా..?
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
ఓడినా విజేతనే.. భారత సింధూరం
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
ఏపీ బంద్.. హోదా కోసం
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
పిహెచ్‌డి పై అబద్ధాలు
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
2018లో తెలుగుదేశం ఖాళీ!
నారా వారి నరకాసుర పాలన
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?

Comments

comments