టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ

Turkey President declare Emergency

టర్కీ సైనిక తిరుగుబాటు ఘట్టం ముగిసిన తర్వాత అక్కడ చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా అధ్యక్షుడు తయీప్‌ ఎర్డోగాన్‌ అత్యవసర పరిస్థితిని విధించారు. ఇది మూడు నెలలపాటు కొనసాగుతుందని ప్రకటించారు. మరోవైపు.. సైనికుల తిరుగుబాటు వెనుక ఏ ఉగ్రసంస్థ హస్తమైనా ఉందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవలె.. ప్రభుత్వంపై అసంతృప్తితో టర్కీ సైన్యంలో ఓ వర్గం తిరుగుబాటు చేసింది. ఈ సందర్భంగా సైనికులు వీధుల్లో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనల్లో పలువురు పౌరులు మృతి చెందారు.

అయితే ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి తిరుగుబాటును అణచివేసింది. అంతేకాకుండా.. వేలాదిమంది తిరుగుబాటు చేసిన సైనికులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ తిరుగుబాటు వెనుక ఉగ్రహస్తం ఉండి ఉండవచ్చని ఆ దేశ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితిన దేశాధ్యక్షుడు విధించారు. టర్కీలో ప్రజాస్వామ్యం విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదని తయూప్ ఎర్డోగాన్ అన్నారు. దేశభద్రతను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టర్కీ జాతీయ భద్రతామండలి, కేబినెట్‌ భేటీ తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
బెంగళూరుకు భంగపాటే
బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు
మోదీ హీరో కాదా?
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
బినామీలు భయపడే మోదీ ప్లాన్
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
ఉద్యోగాలు ఊస్టింగేనా ?

Comments

comments