న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్

Two sweet news on new year eve

పెద్ద నోట్ల రద్దు ప్రకటించినప్పటి నుంచి క్యాష్ కోసం జనం నానా అవస్థలు పడ్డారు. రోజుకు 2 వేల 5 వందలు డ్రా చేయటానికి ఏటీఎం సెంటర్ల ముందు గంటలు గంటలు నిల్చున్నారు. ఐనా.. ఏటీఎంల్లో 5 వందలు, వంద నోట్ల కొరతతో.. ఓన్లీ 2 వేల నోటు మాత్రమే వచ్చేది. లిమిట్ 2 వేల 5 వందలు అని చెప్పినా.. 2 వేలు డ్రా చేసిన వాళ్లే ఎక్కువ. ఇక అత్యవసర సమయాల్లో ఎక్కువ డబ్బు అవసరమైనప్పుడుతీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో.. ప్రజలకు రిలీఫ్ ఇచ్చేలా కొత్త ఏడాదికి దేశ ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి ఏటీఎంల్లో నగదు విత్ డ్రా లిమిట్ 2 వేల 5 వందల నుంచి.. 4 వేల 5 వందలకు పెంచింది రిజర్వ్ బ్యాంక్. ఐతే.. వారానికి 24 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే నిబంధనను మాత్రం అలాగే ఉంచింది.

న్యూఇయర్ కానుకగా రిలయన్స్ జియో వెలక్‌కమ్ కింద పాత కస్టమర్లకు మరో ఆఫర్ ను ప్రవేశపెట్టింది. తన పాత కస్టమర్లకు జనవరి 1వ తేదీ నుంచి ఆటోమెటిగ్గా కొత్త ఆఫర్లలోకి మార్చనున్నారు. న్యూఇయర్ సందర్భంగా ఇప్పుడు వీరంతా ఉచిత కాల్స్‌తో పాటు డేటాను కూడా ఉచితంగా పొందనున్నారు. డేటాపై మాత్రం పరిమితి అమలు కానున్నట్లు తెలుస్తోంది. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద రోజుకు 4 జీబీల 4జీ డేటాను డిసెంబర్ 31 తో ముగియనుంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను మాత్రమే అందించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత దీని వేగం 128 కేబీపీఎస్ కు తగ్గిపోనున్నట్లు తెలుస్తోంది. అయితే పాత కస్టమర్లకు ఈ ప్లాన్ ను అమలు చేయనున్నారు. మార్చి 31 వరకు ఉచిత వాయిస్, డేటా సర్వీసులను పొందవచ్చు.

Related posts:
ఆయనకు వంద మంది భార్యలు
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
సదావర్తి సత్రం షాకిచ్చింది
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
మోదీ ఒక్కడే తెలివైనోడా?
తిరిగిరాని లోకాలకు జయ
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments