రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం

Two Thousand Crore Krishnarpanam

తల్లి కృష్ణవేణి పుష్కరాల కోసం ఒకటి కాదు రెండు ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు సమర్పించేసుకున్నారు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పూజ చేసినా ఫలితం దక్కకపోవడం అంటే ఇదేనేమో. బహుశా ఏపిలో కృష్ణా పుష్కరాల కోసం చేసిన ఏర్పాట్లను ఓ రేంజ్ లో చేసినా కానీ ఫలితం మాత్రం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా లేకుండా పోయింది. గతంలో గోదావరి పుష్కరాల టైంలో జరిగిన దుర్ఘటన వల్ల ఏపిలో జనాలు పుష్కర స్నానానికి ముందురాలేకపోయారు. మొత్తంగా కారణాలు ఏవైనా కానీ కృష్ణా పుష్కరాల విషయంలో చంద్రబాబు నాయుడు కృష్ణార్పణం చేసిన రెండు వేల కోట్ల రూపాయల గురించి తెలుగోడ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ మీ కోసం..

తెలుగు రాష్ట్రాల్లో భక్తిభావం ఎక్కువగా ఉండేది ఏపిలో. అక్కడ దేవుడి కోసం ఖర్చుకు వెనకాడకుండా ముందుకు సాగేవాళ్లు ఎక్కువ. గతంలో గోదావరి పుష్కరాల టైంలో ఎంతో ఖర్చుచేసిన ఏర్పాట్లు చేసినా కూడా చివరకు చెడ్డపేరు వచ్చింది.  దాంతో కనీసం కృష్ణా పుష్కరాలతో అయినా కానీ ఆ పేరును తుడిచిపెట్టాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. అందుకు గాను ఎంత ఖర్చైనా చేసి కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా రెండు వేల కోట్లతో భారీగా ఏర్పాట్లకు పూనుకున్నారు. కానీ వచ్చిన భక్తులు మాత్రం కేవలం 2కోట్ల మంది.

తెలంగాణలో కేవలం 800 కోట్ల ఖర్చుతో దాదాపుగా 2.5 కోట్ల మంది పుష్కర స్నానం చేశారు. విజయవాడతో సహా చాలా చోట్ల భారీగా ఏర్పాట్లు చేశారు. నిజానికి తెలంగాణలో కేవలం నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే కృష్ణానది ప్రవహిస్తోంది. దాంతో ఈ రెండు జిల్లాల్లో మాత్రమే పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. కానీ ఏపిలో మాత్రం అలా కాదు. అయినా కానీ తెలంగాణలోనే ఎక్కువ మంది పుష్కర స్నానం చేశారు. పైగా రెండు వేల కోట్లు ఖర్చు చేసిన ఏపిలో 20 మంది ప్రాణాలు కోల్పోవడం ఆపలేకపోయారు. కానీ  తెలంగాణలో మాత్రం కేవలం 800 కోట్ల ఖర్చుతో చేసిన ఏర్పాట్లతో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోలేదు. పుష్కర స్నానం చెయ్యడానికి ఏపిలో చంద్రబాబు ఎంత కారణమో.. చెయ్యకపోవడానికి కూడా బాబు అంతే కారణం.

అవును.. ఎందుకు అంటే గత గోదావరి పుష్కరాల టైంలో చంద్రబాబు నాయుడు చేసిన హడావిడి కారణంగా దుర్ఘటన చోటుచేసుకుంది. దాంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు అకారణంగా ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఏపి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసినా కానీ భక్తులు మాత్రం పుష్కరిణిలో పుణ్యస్నానానికి కాస్త వెనకడుగు వేశారు. చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాల్లో మొదటి రోజు స్నానానికి వచ్చినప్పుడు భక్తులు తక్కువగా హాజరయ్యారు. విచిత్రయేమిటంటే.. ప్రతిపక్ష నాయకుడు జగన్ హాజరైన రోజు మాత్రం పుష్కర స్నానానికి భారీగా భక్తులు హాజరయ్యారు. ఆ విజయవాడ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ఘాట్ లలో బోయపాటి శ్రీనుతో కృష్ణమ్మ హారతికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ ఆ ప్రభావం ఎక్కువ మంది భక్తులను పుష్కర స్నానానికి రాబట్టుకోలేదు. మొత్తంగా చంద్రబాబు నాయుడు వేసిన కృష్ణా పుష్కరాల తతంగం కేవలం మీడియా స్టంట్ గా మారింది. చివరకు మరోసారి చంద్రబాబు నాయుడుకు చెడ్డపేరు తెచ్చింది.

ఏపిలో ఇప్పటికే ఉద్యోగులకు ఇవ్వడానికి జీతాలు కూడా లేవు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. రూపాయి ఆదాయం రాని.. లేని కృష్ణా పుష్కరాలకు రెండు వేల కోట్లు ఎందుకు పెట్టారు అన్నది ప్రశ్న. కేవలం పేరు గొప్ప కోసం చేసిన హడావిడి చివరకు అపహాస్యం పాలైంది. రెండు వేల కోట్ల ఖర్చుతో ఒక్కో భక్తుడి పేరుతో సగటును వెయ్యి రూపాయలు కేవలం కృష్ణానదిలో స్నానానికి  ప్రభుత్వం తరఫున ఖర్చు చేశారు చంద్రబాబు. ప్రభుత్వం చేసిన ఖర్చు కాదని ప్రతి భక్తుడు కూడా పుష్కర స్నానం కోసం సగటున ఐదు వందలు ఖర్చు చేశారు. ఈ లెక్కన ఈసారి ఏపి భక్తులకు కృష్ణా పుష్కరాలు చాలా ఖరీదుగా మారాయి. కృష్ణా  పుష్కరాల కోసం చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే.. ప్రజలతో మరో వెయ్యి కోట్లు ఖర్చు చేయించారు. ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఖజానా నుండి రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని కష్ణార్పణం చేశారు అన్నది మాత్రం వాస్తవం.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
అమిత్ షా రేస్ లో... తుస్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
సాధించా..
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments