అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు

UP MP Anupriya Patel dramatic entry in Modi Cabinet

వారసుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో నుంచి తమ పిల్లలను బయటకు పంపిస్తారు. మామూలు భాషలో చెప్పాలంటే.. ఇంట్లో నుండి తన్నితరిమేస్తారు. మరి అలా ఓ పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ వాళ్లు అయితే మరీ ఎక్కువగా న్యూస్ లో నిలుస్తుంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ యువ ఎంపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా వెళుతోంది. మోదీ క్యాబినెట్ లో తాజాగా ప్లేస్ కొట్టేసిన 35 ఏళ్ల అనుప్రియ సింగ్ పటేల్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటున్నారు. మోదీ అంతలా ఎందుకు ఆమెకు ప్రయార్టి ఇచ్చారో తెలియదు కానీ ఆమెకు లభించిన గుర్తింపు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోపక్క హెచ్ఆర్ మినిస్టర్ స్రృతి ఇరానీ కి ఈమెను పోటీగా మోదీ రంగంలోకి దింపారు అనే వార్త కూడా సంచలనం రేపుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన స్థానిక పార్టీ అప్నాదళ్ వ్యవస్థాపకుడు, అనుప్రియ తండ్రి సోనే లాల్‌ 2009లో మృతిచెందారు. దీంతో ఆమె తల్లి కృష్ణ పటేల్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి తల్లీకూతుళ్ల మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అనుప్రియను ఆమె తల్లి సస్పెండ్‌ చేశారు. అంతేగాక, ఆమెను పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించారు. కానీ ఆమె మద్దతుదారులు మాత్రం ఆమెనే నిజమైన వారసులు అంటే పార్టీ నుండి విభేదించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన అనుప్రియ పటేల్.. ఇప్పుడు కేంద్రమంత్రిగా నియమితురాలవడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఆమెకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఆమెకు బలమైన అనుచర వర్గం ఉండటం తమ పార్టీకి కలిసివచ్చే అంశంగా బిజెపి భావిస్తోంది. అందుకే, అనుప్రియకు మంత్రి పదవి ఇస్తే బిజెపితో తెగదెంబపులు చేసుకుంటానని ఆమె తల్లి, అప్నాదళ్ అధినేత్రి హెచ్చరించినప్పటికీ బిజెపి అదినాయకత్వం మాత్రం దాన్ని పరగణలోకి తీసుకోలేదు అని క్లీయర్ గా తెలిసివచ్చింది.

అయితే అనుప్రియను కేబినెట్ లోకి తీసుకోవడంలో మోదీ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ సమీకరణల్లో భాగంగా మోదీ పావులు కదుపుతున్నారు. నిజానికి యుపి ఎన్నికల కోసమే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. యుపిలో కుర్మీ వర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అలా యూపీలో ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు అనుప్రియా పటేల్ ఉపయోగపడనున్నారు. యూపీలోని తూర్పు ప్రాంతంలో తన కులస్తులు ఉండటంతో బిజెపికి ఓటెయ్యరాదంటూ బీహార్ సిఎం నితీశ్ కుమార్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అదే కులానికి చెందిన అనుప్రియా పటేల్‌ను బిజెపి రంగంలోకి దించింది. దీంతో నితీశ్ కుమార్‌కు కూడా చెక్ పెట్టినట్లయింది.

ఇక మరోపక్క మోదీ అనుప్రియను రంగంలోకి దిచడం వల్ల స్రృతి ఇరానీకి కూడా చెక్ పెడతారు అని వాదన వినిపిస్తోంది. ఎందుకంటే గతకొంత కాలంగా మోదీ కంటే కూడా చాలా పాపులారిని సంపాదించింది. ఒ దశలో మోదీ కంటే కూడా ఎక్కువ పాపులారిటీ వచ్చిన సందర్భంగా నరేంద్ర మోదీ కాస్త జలసీగా ఫీల్ అయ్యారని తెలుస్తోంది. మొత్తానికి స్రృతి ఇరానికి ఇలా చెక్ పెట్టడానికి మరో మహిళా మంత్రిని రంగంలోకి దించాలని మోదీ స్కెచ్ వేశారని తెలుస్తోంది. మొత్తానికి అనుప్రియకు మాత్రం ఫుల్ పాపులారిటీ వచ్చింది.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
ఆ ఫీట్ ఓటు బ్యాంకు కోసమేనా..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
నయిం కేసులో పెద్ద తలకాయలు
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments