ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?

Venkiah-villan-or-hero

ఆయన మాట్లాడుతుంటే ఎదుటి వారు కిమ్మనకుండా కూర్చోవాల్సిందే. ఆయన నోరు తెరిస్తే చరిత్రను తవ్వితీస్తారు. ఆయన అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా కానీ హవా మాత్రం ఒకేలా  ఉంటుంది. మోదీతో సహా ఎంతో మంది దగ్గర ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. ఆయనే వెంకయ్య నాయుడు. తెలుగు వాడిగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న అయ్యవార్ల మాట తీరు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఓ సారి అవునంటూ. వెంటనే కాదు అంటారు..? ఓ సారి వాళ్లు చేసింది తప్పు అంటారు.. మరోసారి వాళ్లు చేసిందే కరెక్ట్ అంటారు. ఇలా వెంకయ్య నాయుడులో ఉన్న రెండు యాంగిల్స్ తెలుగు ప్రజలకు ఎంటర్ టైనింగ్ గా ఉన్నా.. డైలమాలో మాత్రం పడేస్తున్నాయి.

పార్లమెంట్ సభల్లో వెంకయ్య నాయుడు మాట్లాడుతుంటే.. ఆయన చెప్పిన సమాధానాన్ని లేదంటే ఆయన వేసిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కూడా ఎదుటివాళ్లు కష్టపడతారు. ఎదుటిపక్షంలోని రాహుల్, సానియా, మల్లిఖార్జున్ ఖర్గేలతో సహా అందరిని తన మాటల తూటాలతో ఎన్ కౌంటర్ చేస్తారు. మరి అలాంటి ఘనాపాఠి తన పాండిత్యాన్ని  తెలుగు ప్రజలను డైలమాలో పడేయడానికి వాడుతున్నారనిపిస్తోంది.  అవును పార్లమెంట్ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలనే.. తిరగేసి తనను తాను వెనకేసుకువస్తున్నారు.

నాడు యుపిఎ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలుగా ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొడుతుంటే… నెత్తినోరుకొట్టుకున్నారు. బాబోయ్ రెండు రాష్ట్రాలుగా విడదీసే ముందు సీమాంధ్రకు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించండి అంటూ పెద్దగా గొడవ చేశారు. తెలుగు వాళ్లు ఎక్కడున్నా కూడా వారి సంక్షేమం కోరతానని… తాను తెలంగాణకు వ్యతిరేకిని కాదు… అదే టైంలో సీమాంధ్ర పక్షపాతిని కూడా కాదని అన్నారు. నాడు రక్షణశాఖ మంత్రిని పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాల విభజన టైంలో దాదాపుగా బర్దరఫ్ చేశారు.

(courtesy: ABN Andhrajyothi)

నాడు అంతలా మాట్లాడిన వెంకయ్య నాయుడు ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏమీ చెయ్యలేకపోయారు.. ఇప్పుడు వెంకయ్య నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి తెలుగు వారికి ఏదో ఒకటి చేస్తారు అని అనుకుంటే అది గాలిలో పేకమేడలు కట్టినట్లే ఉంది. వెంకయ్య నాయుడు ఎలా నడుచుకుంటున్నారో ఓ సామెత రూపంలో చెప్పవచ్చు. చచ్చిపోయిన ఆవు, పగిలిన కుండ నిండా పాలిచ్చింది.. మరి వచ్చిన ఆవు మాత్రం కొన్ని పాలిస్తోంది అన్నట్లుంది. చూద్దాం అంటే ఆవు చచ్చిపోయింది.. పాలు తీసిన కుండ కూడా పగిలిపోయింది. మరి దీన్ని ఎలా ట్రీట్ చెయ్యాలో మనకే వదిలేస్తారు వెంకయ్య నాయుడు లాంటి మేధావులు.

నాడు పార్లమెంట్ లో మేధావి వర్గానికి కూడా చెమటలు పట్టించిన వెంకయ్య ఇప్పుడు ప్రతిపక్షాలు నిలదీస్తున్నా కూడా కేవలం తన మాటల గారడీతో అందరిని బురిడీ కొట్టిస్తున్నారు. నాడు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా  కల్పించాలని ఏపి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడిన వెంకయ్య నాయుడు ఇప్పుడు మాత్రం దాని గురించి మాట్లాడటం లేదు. పైగా ప్రత్యేక హోదా కల్పించడం వల్ల మాత్రమే అన్ని కష్టాలు తీరుతాయని అనుకోవడం తప్పని అంటున్నారు.

ప్రత్యేక హోదా కల్పించడం అంతలా అవసరం లేదంటున్న వెంకయ్య నాయుడు.. నాడు యుపిఎ సర్కార్ మాత్రం ఏపికి ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమల స్థాపన దగ్గరి నుండి బడ్జెట్ వరకు ఎన్ని రకాలుగా రాష్ట్రానికి మేలుచేస్తుందో తెలియదా..? పైగా దేశంలో చివరగా రాష్ట్రాలను విడదీసిన నాటి ఎన్డీయే ప్రభుత్వం ఉత్తాఖండ్ కూడా ఎందుకు ప్రత్యేక హోదా కల్పించింది..? అన్నింటికి మించి ఇప్పటికే 11 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించినప్పుడు ఒక్క ఏపికి మాత్రం ఎందుకు కాదంటోంది..? దీనిపై వెంకయ్య నాయుడు ఎందుకు మాట్లాడటం లేదు.

వెంకయ్య నాయుడు పార్లమెంట్ లో తాను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకున్నా.. ఇప్పుడు తెలుగు వాళ్లు వెంకయ్య నాయుడు మా వాడే అని గర్వంగా చెప్పుకునే పని ఒక్కటి కూడా చెయ్యలేదు. మాటలతో మభ్య పెట్టడం తప్ప వెంకయ్య నాయుడు చేసిందేమీ లేదు. ఆయన చెబుతున్నట్లు ఏపికి ఐఐటీ, ఐఐఎంలు విభజన చట్టంలో నాడు యుపిఎ ప్రభుత్వం చెప్పినవి మాత్రమే. అంతేకానీ వెంకయ్య నాయుడు స్పెషల్ గా చేసిందేమీ లేదు.

తెలుగు రాష్ట్రాలకు ఓ సారి తాను పెద్దన్నయ్యలాగా ఆదుకుంటానని అంటారు. మరోసారి మాత్రం ప్రత్యేక హోదా కల్పించడం ఇప్పట్లో కుదరదు అని అంటారు. మరి పార్లమెంట్ లో తన మాటలతో దుమ్మురేపుతున్న ఈ జెంటిల్ మెన్ ని తెలుగు వారు ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికి పాలుపోవడం లేదు. ఇంతకీ ఏపికి ప్రత్యేక హోదా కల్పించడంలో వెంకయ్య నాయుడు నాడు యుపిఎ సర్కార్ ను పార్లమెంట్ లో నిలదీసినందుకు హీరోనా..? ఇప్పుడు అదే ప్రత్యేక హోదాపై దాటవేస్తున్నందుకు విలన్  గా భావించాలో..?!

(courtesy: Ntv)

  • Abhinavachary

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
పవన్ మాస్టర్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
ఎవరు చాణిక్యులు..?
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
ప్రత్యేక హోదా లాభాలు
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?
జయ మరణం వెనక ఆ మాఫియా?

Comments

comments