తిరిగబడితే తారుమారే

Venkaiah Naidu may shock with Ap people for Special Status

ఏపిలో తుఫానుకు ముందు ప్రశాంతత కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ ప్రత్యేక హోదా కోసం పోరాటం మాత్రం గట్టిగా జరిగే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం టైంలో ఓ దశలో టిఆర్ఎస్ సారధి కేసీఆర్ దీక్ష నుండి వెనక్కి తగ్గినప్పుడు విద్యార్థి లోకం తిరగబడిన చందంగానే ఏపి ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తిరగబడే అవకాశాలు ఉన్నాయి. అయితే అది ఎప్పుడు, ఎలా అనేది ఇప్పటికిప్పుడు మాత్రం చెప్పలేం. కానీ ఈ విషయాన్ని గమనించని పెద్దలు మాత్రం నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు.

తెలుగు రాజకీయాల్లో ఎంతో సీనియార్టీ, మేధస్సు కలిగిన వెంకయ్య నాయుడు చేస్తున్న ప్రకటనలు చూస్తే నవ్వొస్తుంది. తాజాగా ఆయన ప్ర‌త్యేక హోదా విష‌యం ఇక ముగిసిన అధ్యాయ‌మేన‌ని వెంక‌య్య వ్యాఖ్యానించారు. వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా పేరుతో విమ‌ర్శ‌లు చేస్తున్న వాళ్లంతా ఆనాడు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. అన్యాయం జ‌రుగుతున్న‌ప్పుడు మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో చెప్పాల‌ని నిల‌దీశారు. పార్ల‌మెంట్ లో తాను నిల‌దీసిన‌ప్పుడు క‌నీసం చాలామంది ఎందుకు మాట్లాడ‌లేద‌న్నారు. ఇక్కడ వెంకయ్య నాయుడు ఓ విషయాన్ని గమనించాలి… ప్రజలు తిరగబడితే పరిస్థితులు మొత్తం తారుమారవడం, పదవులు క్షణాల్లో ఎగిరిపోవడం జరుగుతుంది అని గుర్తించాలి. నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన వెంకయ్యలాంటి వాళ్లకు కూడా ఈ విషయం అర్థం కాకపోవడం నిజంగా విచారకరం.

Related posts:
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
అతడికి గూగుల్ అంటే కోపం
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
వీళ్లకు ఏమైంది..?
బావర్చి హోటల్ సీజ్
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పోరాటం అహంకారం మీదే
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాబు బిత్తరపోవాల్సిందే..
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?

Comments

comments