ఏపీకి ఆ అర్హత లేదా?

Venkaiah naidu said that AP state dont have eligibility for Special Status

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ ఇంకా సజీవంగానే ఉంది. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు కార్యక్రమాలు చేస్తున్నారు. కాగా తాజాగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ కలకలం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా అర్హత ఆంధ్రప్రదేశ్‌కు లేదని ఆయన అన్నారు. దేశ సరిహద్దు రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు, అడవులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, బాగా వెనుకబడిన ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా అర్హత ఉందని చెప్పారు. ఈ నాలుగింటిలో ఆంధ్రప్రదేశ్ దేంట్లోనూ లేదన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూలోటు అధికంగా ఉండి రాష్ట్రం వెనుకబడటంతో ప్రత్యేక హోదా కావాలని మొదట్లో అడిగినట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. ’ఏపీ అభివృద్ధికి కేంద్ర సహకారం-ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై అవగాహన’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఐదేళ్లలో ఏపీలో ఏర్పడే రూ. 22 వేల కోట్ల రెవెన్యూలోటును కేంద్రం అందజేస్తుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం ఐదేళ్లలో రాష్ట్రానికి రూ. 2 లక్షల 6 వేల కోట్లు ఇస్తుందని తెలిపారు. ఆర్థిక సంఘం కేటాయింపుల్లో ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీని ఒడిశా, పశ్చిమబెంగాల్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే వెంకయ్య నాయుడు వ్యాఖ్యల మీద అప్పుడే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వెంకయ్య నాయుడులాంటి వ్యక్తి నాడు పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఇలా వక్రీకరించడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
అతడికి గూగుల్ అంటే కోపం
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
కాశ్మీర్ భారత్‌లో భాగమే
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
ప్యాకేజీ కాదు క్యాబేజీ
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ

Comments

comments