సన్మానం చేయించుకున్న వెంకయ్య

venkiah-ff

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు సన్మానం చేయించుకున్నారు. అవును.. ఆయన ఆంధ్రప్రదేశ్ కు చేసిన మేలుకు గాను సన్మానం చేయించుకున్నారని హీరో శివాజీ విమర్శించారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ముందు నుండి వాదించిన వెంకయ్య చివరకు మొండి చేతులు చూపించారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం ఇప్పడు కుదరదు అని వెంకయ్య నాయుడు చెప్పకుండానే చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో ఏపికి ప్రత్యేక హోదా అనేది అందని ద్రాక్షగా మిగిలింది. కాగా నేడు వైసీపీ ఇచ్చిన బంద్ కు ఏపిలో సంపూర్ణ మద్దతు లభించింది.

ప్రత్యేక హొదా కోరుతూ వైసీపీ పిలుపునిచ్చిన బంద్ కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతుపలికారు. ఎక్కడికక్కడ బంద్ నిర్వహించడంతో పాటు కేంద్రానికి గట్టి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. కాగా ఏపికి మంచి చేసే ప్రత్యేక హోదాను కాదని ప్రత్యేక సహాయం చేసిన వెంకయ్య నాయుడు బిజెపి నేతలతో తనను తాను సన్మానించుకున్నారని హీరో శివాజీ వ్యాఖ్యానించారు. ఏపిలో జరుగుతున్న బంద్ లో పాలుపంచుకున్న శివాజీ మరోసారి వెంకయ్య మీద నిప్పులు చెరిగారు.

హోదా కోసం తాను మాట్లాడితే ఓ ఎంపీ త‌న‌ను నాలుక కోస్తాన‌ని హెచ్చ‌రించార‌ని అన్నారు. మ‌రి జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా హోదా కోసం గ‌ళ‌మెత్తితే ఆయ‌న‌ను నాలుక కోస్తా అని ఎందుకు అన‌లేదని శివాజీ ప్ర‌శ్నించారు. అభిమానులు, ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తార‌ని భ‌య‌ప‌డుతున్నారా? అని దుయ్య‌బ‌ట్టారు. మ‌నిషిని బ‌ట్టి ఎంపీలు ఆచితూచి మాట్లాడుతున్నారని ఆయ‌న అన్నారు. ఎంత‌కాలం ప్ర‌జ‌ల‌ని మోసం చేస్తారని శివాజీ ప్ర‌శ్నించారు. మ‌నం ఎందుకు భ‌య‌ప‌డాలి? అని అడిగారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే వ్య‌క్తికి హోదా తీసుకొచ్చే స‌త్తా ఉందని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌లు న‌మ్మిన వ్య‌క్తి ప‌వ‌న్ అని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో ఆయ‌నకు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని వ్యాఖ్యానించారు.

అప్పుడ‌పప్పుడు కేంద్రం భిక్ష‌మేస్తోందని శివాజీ అన్నారు. ఇచ్చింది తీసుకోవాల‌నే ధోర‌ణి వ‌ద్దని పరోక్షంగా సీఎం చంద్రబాబుకు సలహా ఇచ్చారు. త‌న‌కు రాజ‌కీయాలు చేసే ఉద్దేశం లేదని, ఆంధ్ర‌ ప్రాంతానికి న్యాయం చేయాల‌నే ఉంద‌ని అన్నారు. ప‌వ‌న్ కళ్యాణ్ జ‌నసేన పెట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకున్నారు. అలాగే శివాజీ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య పెట్టుకున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించ‌మేంట‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
బావర్చి హోటల్ సీజ్
మా టీవీ లైసెన్స్ లు రద్దు
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
నారా వారి నరకాసుర పాలన
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
మోదీ ప్రాణానికి ముప్పు
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
గాలిలో విమానం.. అందులో సిఎం
తిరిగిరాని లోకాలకు జయ
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
అందుకే భూకంపం రాలేదట
యాహూ... మీ ఇంటికే డబ్బులు

Comments

comments