ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి

Vijaya sai Reddy raor on Special Status to AP in Parliament

పార్లమెంట్ లో ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓ గర్జన పార్లమెంట్ లో వినిపించింది. ఇప్పటి దాకా ప్రత్యేక హోదా మీద పెద్దగా చర్చకు కూడా అవకాశంలేని టైంలో.. కేంద్రం వైఖరి నుండి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వరకు అందరిని చాలా జాగ్రత్తగా, సుత్తిమెత్తగా ఏకిపారేశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగం ఆకట్టుకుంది అనేకన్నా ఆలోచింపజేసింది అనే మాట సరైనదేమో. స్వతహాగా ఆర్థికవేత్త అయిన  ఆర్థిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఇరుకన పెట్టారు.

ముందుగా సభలో ప్రస్తావించాల్సిన ప్రతి అంశాన్ని చాలా డీప్ గా ప్రిపేర్ అయిన విజయసాయి రెడ్డి స్పీకర్ నుండి 20 నిమిషాల టైం కోరారు. తనకు అవకాశం కల్పించిన తమ నాయకుడు జగన్ కు కృతజ్ఞత తెలిపి.. తర్వాత ఏపి ప్రత్యేక హోదా అంశాన్ని చాలా బాగా వివరించారు. అంతకు ముందు ఈ బిల్ ఆర్థిక బిల్లు కాబట్టి రాజ్యసభలో పెట్టడం కుదరదు అని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిండంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రైవేట్ బిల్ ప్రతిపాదన ఖచ్చితంగా ఆర్థిక బిల్ కాదు అని వివరించారు.  నిజానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును 2014లో ఆమోదించినప్పుడు దానికి రాజ్యాంగ సవరణ అవసరమైనా చేయలేదని అన్నారు. అలాంటప్పుడు సవరణను ఆర్థిక బిల్లుగా ఎలా పరిగణిస్తారు? రాజకీయ, సాంకేతిక కారణాల వల్ల అధికారపక్షం దీన్ని ఆర్థికబిల్లుగా పరిగణించవచ్చు కానీ న్యాయపరంగా చూస్తే మాత్రం ఇది ఆర్థికబిల్లు కాదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఆశిస్తూ పెట్టిన ప్రైవేట్ బిల్ లో పై వచ్చిన అనుమానాలను విజయసాయిరెడ్డి పటాపంచలు చేశారు. కేవీపీ పెట్టిన బిల్ ను ఆర్థిక బిల్ గా చూడక్కర్లేదని అన్నారు. ఆ లెక్కన చూస్తే ప్రతి బిల్ లో 70 నుండి 75శాతం వరకు ఆర్థిక అంశాలుంటాయని వివరించిన ఆయన.. బిల్ పై ఓటింగ్ కు అవకాశం కల్పించాలని అన్నారు. ఏపి పునర్వ్యవస్థీకరణ బిల్ సందర్భంగా నాటి ప్రధాని ఆరు హామీలిచ్చారని, అందులో ఏపికి ప్రత్యేక హోదా కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. నాటి ప్రధాని ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే.. సభాహక్కుల ఉల్లంఘన అవుతుందా అనే అనుమానం కలుగుతోంది అంటూ అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టారు.

ఇక ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, బిజెపి పార్టీల వైఖరిని విజయసాయిరెడ్డి పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టారు. నాడు ఈ రెండు పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఏపికి ప్రత్యేక హోదాపై హామీలిచ్చాయని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి ర్యాలీలోను, విశాఖ సభలో కూడా స్వయంగా చెప్పారని మోదీ హామీని గుర్తు చేశారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. ఇక మరో ఎంపీ వెంకయ్య నాయుడు ఏపికి ఐదేళ్లు కాదు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చారని చురకలంటించారు.

ఏపికి ప్రత్యేక హోదాపై ముందుకు, వెనక్కి కదలకుండా కూర్చున్న చంద్రబాబు నాయుడుకు పార్లమెంట్ నుండి సెగ తగిలేలా చేశారు. చంద్రబాబు సర్కార్ కు పార్లమెంట్ లో పొగబెడితే ఏపిలో మంటలు వచ్చేలా చేశారు విజయసాయి రెడ్డి. నాడు ప్రత్యేక హోదాపై నోరేసుకుపడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏకంగా మాట మార్చేశారని అన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఆయన అంటున్నారని కానీ వాస్తవానికి అది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంజీవనే అవుతుందని స్పష్టం చేశారు. ఇక కేంద్రం చెబుతున్న 14వ ఆర్థిక సంఘం పాత్రను కూడా విజయసాయి రెడ్డి  ప్రశ్నించారు.

ఆర్థిక సంఘం అనేది ఆర్ధిక అంశాలలో కేంద్రప్రభుత్వానికి తగిన సలాహాలు, సూచనలు ఇచ్చే సంస్థే తప్ప స్వయంగా నిర్ణయాలు తీసుకొనే అధికారాలు దానికి ఉండవని విజయసాయి రెడ్డి అన్నారు. కనుక అది అనుమతించలేదనే సాకుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ వంటి హామీలని అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం తప్పించుకోవడం సబబు కాదని వాదించారు. ఇలా విజయసాయిరెడ్డి తన స్పీచ్ లో కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రజాకోర్టులో బోనులో నిలబెట్టారు. ప్రధాని మోదీ, వెంకయ్యనాయుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఏపి సిఎం చంద్రబాబు నాయుడులను ఒకే ఒక్క స్పీచ్ తో ఇరకాటంలో పెట్టాడు కాబట్టే ఆయన ఏపికి ఒక్క మగాడు.

ఇక్కడ మరో కీలకాంశం ఏంటంటే.. విజయసాయిరెడ్డి వెనక జగన్ ఆడిన ఈ చదరంగంలో పార్లమెంట్ లో మోదీ సర్కార్ డైలమాలో పడితే, ఏపిలో చంద్రబాబు నాయుడు డైలమాలో పడ్డారు. మామూలుగా అయితే పెద్దగా మాట్లాడని విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు చూసిన చాలా మంది చెప్పిన ఒకటే మాట ‘‘జగన్ సరైన సమయంలో సరైన బాణాన్ని ఎక్కుపెట్టారు’’ అని. నిజమే విజయసాయి రెడ్డి ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలి అన్న డిమాండ్ ను బలంగా వినిపించారు అన్నదాంట్లో వందకు వంద శాతం విజయం సాధించారు.

Related posts:
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
టిఆర్ఎస్‌తో బిజెపి మైండ్ గేమ్
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
బాబు నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్షి
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
మెరుపు దాడి... నిజమా-కాదా?
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
పైసలు వసూల్ కాలేదుగా..
ఆ కంపెనీ దెబ్బకు పేటిఎం ఢమాల్!

Comments

comments