సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?

War between Pawan Kalyan and Chandrababu Naidu

ఏంటి బాలయ్య సినిమాలో డైలాగు పవన్ కు, చంద్రబాబు నాయుడుకు వాడుతున్నారు అని అనుకుంటున్నారా? సిట్యువేషన్ కు సూట్ అవుతుంది అని ఆ డైలాగును టైటిల్ గా వాడుకున్నాం. ఏపిలో రాజకీయాలు రంజుగా మారాయి. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ జనసేన నుండి పోటుతప్పేలా కనిపించడం లేదు. గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, బిజెపి పక్షానికి మద్దతుపలికిన పవన్ గత కొంత కాలంగా స్ట్రాటజీ మార్చి జనాల్లోకి వెళుతున్నారు. వెళుతూ వెళుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్వేగాలను తట్టిలేపుతున్నారు.

గత ఎన్నికల్లో మిత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు మిత్రులు కారు. పైగా ఎన్నికల టైం సమీపిస్తున్న కొద్దీ వీరిద్దరి మధ్య వైరం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడుకు నాడు ఓటువెయ్యమని అడిగిన పవన్ ఇప్పుడు జనాల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అందుకుగాను కాకినాడ, తిరుపతి సభలను వాడుకోకున్నా అనంతపురం సభను మాత్రం బాగానే వాడుకున్నారు. నేరుగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చెయ్యకున్నా కానీ తెలుగుదేశం ను మాత్రం పవన్ టార్గెట్ చేశాడు.

2019 ఎన్నికల్లో తాను, తన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే కుండబద్దలుకొట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకుకు గండికొడుతున్నారు. ఏపి రాజకీయాల్లో చాపకింద నీరుగా మారారు. కాలేజీ విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడిన పవన్ చంద్రబాబును డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యకపోయినా, పరోక్షంగా ఏపి ప్రభుత్వం తప్పులు చేస్తోందని అర్థంవచ్చేలా వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలుగుదేశం, బిజెపిల మద్దతుతోనే జనాల్లోకి వెళ్లిన పవన్ ఇప్పుడు సొంత పార్టీ మీద దృష్టిపెట్టారు.

జనసేన పార్టీ అంటే కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే అనే భావన రాకుండా కూడా ఆయన జాగ్రత్తపడుతున్నారు. ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చే ఎన్నికల నాటికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని అనిపిస్తోంది. అందులో భాగంగానే గతంలో టీవీ షోల్లో జనసేన పార్టీ తరఫున గొంతు వినిపించే వాళ్లు ఎవరూ ఉండే వాళ్లు కాదు కానీ ఇప్పుడు టీవీ చర్చల్లో జనసేన తరఫున కొంత మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. అంటే పార్టీని మెల్లమెల్లగా పవన్ విస్తరిస్తున్నారు.. ప్రజలకు దగ్గర చేరుస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కు ఉన్న బలం ఆయన ఫ్యాన్సే. అందుకే పవన్ తన ఫ్యాన్స్ ను మరింత దగ్గర చేసుకునేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. పవన్ ఫ్యాన్స్ ఉంటున్న గ్రూప్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టిసారించారు. మొత్తానికి పవన్ అడుగులు వెంటనే వెయ్యలేకపోతున్నా కానీ ఎంతో ఆలోచనతో వేస్తున్నారు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే పవన్ వేస్తున్న ప్రతి అడుగు కూడా చంద్రబాబు నాయుడుకు దడపుట్టించేదే. తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకునే టార్గెట్ గా చేస్తూ పవన్ అడుగులు వేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల టైంలోపు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదురుతుందో? లేదంటే రణమే జరుగుతుందో చూడాలి.

Related posts:
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
అడకత్తెరలో కేసీఆర్
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
పట్టిసీమ వరమా..? వృధానా..?
మద్యల నీ గోలేంది..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
ఇక యుద్ధమే కానీ..
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
పిట్టల దొరను మించిన మాటల దొర
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments