బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం

War with tomatos not with bombs

దాయాది  దేశాల మధ్యన నెలకొన్న ఉద్రిక్తతలు పరిస్థితులను మార్చేశాయి. పాకిస్థాన్ మీద భారత్ ఎంత తీవ్రంగా వత్తిడి తీసుకువస్తోందో అందరికి తెలుసు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులు ఆ దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. ఓ వైపు సర్జికల్ దాడులతో భారత్ వణికిస్తుంటే.. మరోవైపు అంతర్జాతీయ వేదికలపై కూడా పాక్ ఒంటరిగా మిగులుతోంది. ఇదే సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు భారత్.. సరిహద్దులను కూడా మూసేసింది. దీంతో పాక్ కష్టాలు మరింత పెరిగాయి. ఇప్పుడు కొత్తగా గుజరాత్ వ్యాపారులు తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్ అల్లాడిపోతోంది. తమ రాష్ట్రం నుంచి పాకిస్థాన్ కు కూరగాయలు.. ముఖ్యంగా టమోటాలు, మిర్చి ఎగుమతి చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీనివల్ల గుజరాత్ లోని రైతులకు వ్యాపారులకు రోజుకు 3 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తోంది. అయినా సరే.. దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడేది లేదని గుజరాత్ రైతులు స్పష్టం చేస్తున్నారు.

గుజరాత్ రైతుల నిర్ణయంతో పాకిస్థాన్ నానా కష్టాలు పడుతోంది. అక్కడి ప్రజలు కూరగాయలు, పచ్చిమిర్చ దొరక్క అల్లాడిపోతున్నారు. ప్రతిరోజు అహ్మదాబాద్ నుంచి 50 ట్రక్కుల్లో టమోటాలు, మిర్చి వాఘా సరిహద్దు గుండా వెళ్తాయి.. ఇప్పడు వాటిని నిలిపివేసినట్టు అక్కడి వ్యాపారులు తెలిపారు. బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలు, కెనడా, సౌతాఫ్రికా వంటి దేశాలకు మాత్రం ఎగుమతి చేస్తూనే ఉన్నారు.రెండుదేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యే వరకు వాళ్లకు కూరగాయలు పంపబోమని గుజరాత్ వ్యాపారులు స్పష్టం చేశారు.

ఏ దేశమైనా యుద్ధానికి దిగితే బాంబులతో దాడి చేస్తుంది కానీ వ్యాపార సంబందాలు ఉన్న దేశాలు మాత్రం ఇలానే చేస్తుంటాయి. భారత్ కూడా అలాంటి ప్లానే ఫాలోఅవుతోంది. అందుకే టమోటాలు, మిర్చి సరఫరాను నిలిపివెయ్యడంతో పాకిస్థాన్ లబోదిబోమంటోంది. అక్కడి ప్రజలు టమోటోలు లేక తీవ్ర కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మోదీ దూకుడు చూసి ఎన్నికలకు ముందు భారత్ పాకిస్థాన్ యుద్ధం జరిగితే మాత్రం బాంబ్ వేస్తాడు అనే భావన ఉండేది. కానీ ఎన్నికల తర్వాత మోదీ పిఎం అయిన తర్వాత సీన్ మారింది. పాకిస్థాన్ మీద మోదీ చేస్తున్న యుద్ధం మాత్రం ఒరిజినల్ బాంబులు కాకుండా టమాటలతో పాక్ కు చమటలు పట్టిస్తున్నారు.

మరోపక్క పాకిస్థాన్ మీద భారత హాకర్లు కూడా సైబర్ వార్ ప్రకటించేశారు. భారత్ మీద దాడి చేస్తే భారత హ్యాకర్లు ఊరుకుంటారా..? పాక్‌ ప్రభుత్వ వెబ్‌ సైట్లలోకి ప్రవేశించి కంప్యూటర్లని, అందులో ఉన్న సమాచారాన్ని లాక్‌ చేశారు. వీటిని సాధారణ స్థితికి తీసుకురావడానికి పాక్ టెక్నీషియన్లు నానా అవస్థలు పడుతున్నారు. వీటిని అన్ లాక్ చేసిన వారికి భారీ మొత్తంలో డబ్బుని ఇస్తామని కూడా ప్రకటించారు. మొత్తానికి భారత్ చేస్తున్న ఈ దాడుల నుండి తట్టుకోవడం మాత్రం పాకిస్థాన్ కు  కావడం లేదు.

Related posts:
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
అమ్మకు ఏమైంది?
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
2018లో తెలుగుదేశం ఖాళీ!
అడవిలో కలకలం
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
రాసలీలల మంత్రి రాజీనామా
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
వాళ్లకు ఇదే చివరి అవకాశం
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments