కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?

Komati-reddy-son-murder

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గా పేరున్న నయీంను తెలంగాణ పోలీసులు మట్టుబెట్టారు. నయీం చనిపోయిన తర్వాత అతడు చేసిన ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం బాధితులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చి, తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలిసిన ఓ విషయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొడుకు ప్రతీక్ రెడ్డిని తాను హతమార్చి… యాక్సిడెంట్ గా చిత్రీకరించానని నయీం తనతో చెప్పాడని గంపా నాగేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దాంతో నయీం నిజంగా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డిని చంపేశాడా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఆ రోజు ఏం జరిగింది…?
కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్ గ్రామ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ‘కారు ప్రమాదం’లో చనిపోయాడు. అతనితోపాటు స్నేహితులైన సుజీత్‌కుమార్, చంద్రారెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరో స్నేహితుడు అరవ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ప్రమాదమేనని, పటాన్‌చెరు వైపు వస్తుండగా గొర్రెలను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పిందని పోలీసులు అప్పట్లో పేర్కొన్నారు. సర్వీసు రోడ్డు పక్కనున్న మట్టి, రాళ్ల కుప్పను ఢీకొని కారు ఎగిరిపడిందని తేల్చారు. ప్రతీక్ మృతదేహం రోడ్డుకు 20 అడుగుల దూరంలో పడింది. ఇది రోడ్డు ప్రమాదంగానే పోలీసు రికార్డుల్లో ఉండిపోయింది. అయితే ప్రతీక్‌ను తానే చంపించానని నయీమే స్వయంగా చెప్పాడని నాగేందర్ తాజాగా ఆగస్టు 17న భువనగిరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘‘గత మార్చి 18న నయీమ్ అనుచరులు నన్ను నయీమ్ వద్దకు తీసుకువెళ్ళారు. రూ.5 కోట్లివ్వాల్సిందిగా నయీమ్ నన్ను డిమాండ్ చేశాడు. లేదంటే నా కుటుంబీకుల్ని హతమారుస్తానన్నాడు. రోడ్డు ప్రమాదంగా కన్పించేలా నా కుమారుల్ని చంపుతానన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకునూ అలాగే చంపానన్నాడు. అది హత్య అని ఎవరూ గుర్తించలేదని చెప్పుకొచ్చాడు’’ అని వివరించారు. పోలీసులు మాత్రం కేవలం నయీమ్ బెదిరింపుల కోసం చెప్పిన మాటల ఆధారంగా దీనిపై ఓ నిర్ణయానికి రాలేమంటున్నారు. అయితే ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలంటూ నయీమ్ తనను బెదిరించాడని వెంకట్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇటీవలే ప్రకటించడం తెలిసిందే. దీనితో ఈ హత్య కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
ఏపీ బంద్.. హోదా కోసం
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
16 ఏళ్ల క్రితమే అమ్మ వీలునామా
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments