బ్యాంకు నుండి రెండున్నర లక్షలు డ్రా చేసుకోవచ్చు

We can draw two and Half lakh from Bank account

కరెన్సీ నోట్లకు కటకట కొనసాగుతూనే ఉంది. ఎనిమిదో తేది ఎనిమిది గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పెద్ద నోట్లను బ్యాన్ చేయడంతో, చిల్లర దొరక్క ప్రజలు నానాఇబ్బందులుపడుతున్నారు. అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా కానీ కేవలం నాలుగు వేలు నేరుగా, ఏటీఎం ద్వారా అయితే కేవలం రెండున్నర వేలు మాత్రమే డ్రాచేసుకునే వెసలుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రజలుపడుతున్న ఇబ్బందిని దృష్టిలో కొంత వెసలుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది.  బ్యాంకుల్లో డబ్బు విత్ డ్రా, ఎక్సేంజ్ లకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేసినట్టు ప్రకటించారు ఆర్థిక సలహాదారు శక్తి కాంత్ దాస్. మొత్తం ఏడు పరిమితులను ప్రకటించారు.

ఆర్బీఐ ప్రకటించింది ఏడు నిబంధనలు ఇవే..
– రైతుల విత్ డ్రా లిమిట్ పెంపు
కిసాన్ కార్డ్ హోల్డర్లు,  రైతులు క్రాప్ లోన్ తో సంబంధం లేకుండా రూ. 25 వేల రూపాయల వరకు బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
– పెళ్లికి 2.5 లక్షలు విత్ డ్రా
పెళ్లి ఉన్న ఇంట్లో కేవైసీ(డిక్లరేషన్) సమర్పించి పెళ్లిజంట తల్లిదండ్రులలో ఎవరో ఒకరి అకౌంట్ల నుంచి రూ 2 లక్షల 50 వేల రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది.
– నోట్ల ఎక్సేంజ్ నిబంధనల్లో మార్పులు
రేపటి నుంచి బ్యాంకుల్లో నోట్ల ఎక్సేంజ్ కు పరిమితి విధించింది ప్రభుత్వం. రూ 4వేల 500 నుంచి రూ. 2000 వరకు కు మాత్రమే నోట్ల ఎక్సేంజ్ చేసుకోవాలని ప్రకటించింది. అవసమరమున్న వారే కాక చాలా మంది ఎక్కువ మొత్తంలో మనీ విత్ డ్రా చేసుకుంటున్నారన్న కారణంతో ఈ నిబంధనలు విధించినట్టు శక్తి కాంత్ దాస్ ప్రకటించారు.
– సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఊరట
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ నెల సాలరీ అడ్వాన్స్ కింద రూ 10 వేల రూపాయల వరకు క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. గ్రూప్ సీ ఉద్యోగుల దాకా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ప్రకటించింది.
– ట్రేడర్లకు విత్ డ్రా లిమిట్ పెంపు
మండి, మార్కెట్ వ్యాపారస్తులకు బ్యాంకుల్లో విత్ డ్రా లిమిట్ ను పెంచింది. వారానికి రూ. 50 వేల రూపాయలను విత్ డ్రా చేసుకొవచ్చని తెలిపింది.
– క్రాప్ ఇన్సురెన్స్ కు 15 రోజల గడువు పెంపు
రైతులు క్రాప్ ఇన్సురెన్స్ చెల్లించేందుకు మరో 15 రోజుల గడువు పెంచింది ప్రభుత్వం. ప్రీమియంకు పాత నోట్లను సమర్పించవచ్చని తెలిపింది.
– చెక్ ద్వారా రైతులు రూ. 25 వేలు విత్ డ్రా
రైతులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన చెక్ ద్వారా రూ 25 వేల రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు

Related posts:
ఇదో విడ్డూరం
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
సదావర్తి సత్రం షాకిచ్చింది
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?

Comments

comments