రాజీనామాలు అప్పుడే

we will resign for ap special status

ఏపి ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదాపై మరోసారి కుండబద్దలుకొట్టారు. ఎన్ఆర్ఐలతో ఓ టీవీలో చేసిన లైవ్ లో మరోసారి జగన్ తన మార్క్ చూపించారు. ఏపికి ప్రత్యేక హోదాను సాధించేందుకు తాను, తన పార్టీకి చెందిన వాళ్లు ఏం చెయ్యగలరో జగన్ వివరించారు. విభజన తర్వాత ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఏపికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని, ఆ రకంగా యువత పోరాటం చెయ్యాలని జగన్ పిలుపునిచ్చారు.

హోదా కోసం ఎంతటి ఉద్యమం అయినా చేసేందుకు మా పార్టీ సిద్దంగా ఉందని, అందుకు సంబంధించిన కార్యచరణ త్వరలో వెళ్లడి చేస్తామని జగన్‌ అన్నాడు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలం అయ్యారు అని, దమ్ముంటే ప్రత్యేక హోదా కోసం తెలుగు దేశం ఎంపీలను రాజీనామా చేయించాల్సిందిగా డిమాండ్‌ చేశాడు. తమ పార్టీ ఎంపీలు ఎప్పుడు అంటే అప్పుడు రాజీనామాకు సిద్దంగా ఉన్నారు అని, అవసరం అనుకున్న వెంటనే రాజీనామా చేస్తారు అని వైకాపా అధినేత జగన్‌ అన్నాడు. మొత్తానికి తమ పార్టీ ఎంపీలకు పదవులు ముఖ్యంకాదు అని, ఏపి ప్రజల సంక్షేమం మాత్రమే తమకు ముఖ్యమని జగన్ చెప్పకనే చెప్పారు.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
స్టే ఎలా వచ్చిందంటే..
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
బాబు బండారం బయటపడింది
నారా వారి అతి తెలివి
మావో నాయకుడు ఆర్కే క్షేమం
అమెరికా ఏమంటోంది?
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
ట్రంప్ సంచలన నిర్ణయం
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
ఒక్క రూపాయికే చీర
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి

Comments

comments