స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో…

What a hipe in social Media for PV Sindhus Silver Medal

సోషల్ మీడియా సైట్లలో సింధు సాధించిన తర్వాత జరిగిన పరిణామాలు, ప్రభుత్వాల తీరుపై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఓ పోస్ట్ మీ కోసం..

రియో ఒలంపిక్స్ లో వెండి పతకం సాధించిన సింధుని అభినందించాల్సిందే. కాని కోట్లకు కోట్లు, వేల గజాల స్ధలాలను ప్రభుత్వం వాళ్ళ కి ధారాదత్తం చేయటం సమంజసం కాదు. అవే కోట్లు పెట్టి ఎంతో మంది ఆర్ధిక స్ధోమత లేని క్రీడాకారులను ప్రభుత్వం  ప్రోత్సహించాలి . కాని ఇలా కోట్లు ఒక్కరికే కుమ్మరించటం మంచి సాంప్రదాయం కాదు. మెరికా స్విమ్మర్ ఫెల్ఫ్ ఒలంపిక్స్ లో  మొత్తం 23 స్వర్ణ పతకాలు సాధించాడు. మనలా అయితే అమెరికా దేశాన్నే రాసివ్వాలి కాని. అది అక్కడ సాదారణం. మీరు చేయవల్సిందీ , సింధు కి కోట్లరూపాయల విలువ చేసే స్థలాలు కాదండి( అది జనం కష్టార్జితం ). సింధూ లాంటి అమ్మాయిలని ఎలా తయారు చేయాలి ???అందుకు మీ గవర్నమెంటులు ఏం చేయబోతున్నాయో, ఏ క్రీడావిధానం అమలుచేస్తారో ?? చెప్పండి !!

  • స్కూల్లో పిల్లలు ఆటలు ఆడినందుకు పరీక్షల్లో మార్కులు కలపండి.
  • ఆటస్థలం లేకపోతే, వ్యాయామ‌ ఉపాధ్యాయుడు లేకుంటె స్కూల్ మూసేయించండి
  • టైం టేబుల్ లో ఒక్క పీరియడ్ అయినా సరే పిల్లలు ఆటలు ఆడాల్సిందే అని హుకుం జారీ చేయండి.
  • Playing Kits , అన్ని స్కూల్స్ కు ఉచితంగా ఇవ్వండి ( ఇవి ఇవ్వటానికి డబ్బు ఉండదేం )
  • ఒలంపిక్స్  గాదు ముందు లోకల్ టోర్నమెంట్సు ,ఆడించండి

లోకల్ టాలెంటెడ్ ‘ సింధూ’లు చాలా మంది ఉన్నారు. పాపం మీ దరిద్రగొట్టు విద్యావిధానాల వలన ఇంటా ,బయట , స్కూల్లోనూ ప్రతి క్షణం ,చదువు,చదువు , పరీక్షలు, మార్కులు ,అని ఒకటే బెంగతో ఇటు తల్లితండ్రులు ,అటు పిల్లలు తరగతి గదులలో,హోమ్ వర్క్ తో మగ్గి పోతున్నారు , వారంతా ,ఒక్కసారిగా ,మైదానంలో అడుగిడితే ,ప్రపంచంలో భారతీయులవే పధకాలు….

సచిన్ ని మోసినంతకాలం మోసారు.ఏమైంది ? ఇప్పుడు ఎంతమంది సచిన్ లు రెడీగా ఉన్నారు ??? తెలంగాణలొని ప్రభుత్వ బాలికల పాఠశాలలో మూత్రశాలలు లేవు, కనీస సౌకర్యాలు లేవు , ఆర్ధిక స్ధోమత లేక ఎంతో మంది పిల్లలు బడికి రావటం లేదు. అటువంటి సమస్యల పైన నిధులు పెట్టండి హర్షనీయంగా ఉంటది. అమ్మా ‘ సింధూ ‘ నీ విజయాన్ని తక్కువ చేయటానికి కాదమ్మా మేం‌ అంటున్నది….
ఈ మాత్రం చలనం కలిగించావు అందుకు కు జే జే లు!!!!

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
అతడికి గూగుల్ అంటే కోపం
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
అకౌంట్లో పదివేలు వస్తాయా?
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
బినామీలు భయపడే మోదీ ప్లాన్
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
BSNL లాభం ఎంతో తెలుసా?
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
గుదిబండగా మారిన కోదండరాం

Comments

comments