వంద, యాభై నోట్లు ఉంటాయా?

What about hundred and fifty notes ban

దేశంలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద నోట్ల బ్యాన్ తో దేశంలో తీవ్ర ఆందోళన మొదలైంది. కాగా పెద్ద నోట్లతో పాటుగా వంద, యాభై నోట్లను కూడా బ్యాన్ చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుండి ప్రకటన వచ్చింది. దేశంలో విస్తృతంగా చ‌లామ‌ణిలో ఉన్న రూ.100, రూ.50 నోట్ల రద్దు చేస్తారంటూ వచ్చిన వధంతులు నమ్మవద్దని కేంద్రం ప్రకటించింది. ఆ నోట్ల రద్దు ఇప్పట్లో చేయబోమని స్పష్టంచేసింది. చిన్న నోట్లపై ప్రధాని మోడీ జాతినుద్దేశించి మరోసారి మాట్లాడతారంటు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చింది.

బ్యాంకు లాకర్లను, బంగారు, వజ్రాల ఆభరణాలను సీజ్ చేస్తారని వధంతులు వ్యాపించాయి. అలాంటిదేమి లేదంది. ఏదైనా పరిమితికి మించి ఆదాయ ఆస్తులు ఉంటే చర్యలు తథ్యం అని తెలియజేసింది కేంద్రం. 2వేల నోటు నాణ్యతను పరీక్షించాల్సిన అవసరం లేదని తెల్పింది ప్రభుత్వం. ఇంటాగ్లియో అనే కలర్ వాడటం వల్ల రంగు అద్దినట్టు ఉంటుందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. రంగుపోతేనే అసలు నోటుగా గుర్తించాలని వెల్లడించింది. కొత్త రూ. 2000, రూ.  500 నోట్లను ఇంటాగ్లియో ప్రింటింగ్ ఫీచర్‌తో రూపొందించడం వల్ల టర్బో ఎలక్ట్రిక్ ప్రభావం వల్ల ఆ నోటు రంగు పోతుందని తెలిపారు కేంద్ర ఆర్థిక సలహాదారు శక్తికాంత్ దాస్. అది సెక్యూరిటీలోభాగమని ఆయన అన్నారు.

మరోపక్కబ్యాంకుల్లో పాత నోట్లు ఇచ్చి.. కొత్త నోట్లు తీసుకోవటంపై ఆంక్షలు విధించింది కేంద్రం. ఇప్పటి వరకు రోజుకు రూ.4వేల 500 రూపాయలు కొత్త నోట్లు ఇచ్చేశారు. ఈ మొత్తంపై ఆంక్షలు విధించింది. ఇక నుంచి కేవలం రూ.2వేలు మాత్రమే ఇవ్వనున్నారు. రేపటి నుంచి అమలు కానుంది. ఇది కేవలం బ్యాంకుల్లో నోట్ల ఎక్స్ ఛేంజ్ వరకు మాత్రమే వర్తిస్తుందని ప్రకటించారు. మరిన్ని వెసలుబాట్లు కల్పిస్తున్నందున.. పాత 500, 1000 నోట్లు తీసుకుని కొత్త నోట్ల మార్పిడిని తగ్గించినట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారు శక్తికాంత్ దాస్ ప్రకటించారు.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
బాబోయ్ బాబు వదల్లేదట
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
మా టీవీ లైసెన్స్ లు రద్దు
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
బాబు గారి అతి తెలివి
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
గుదిబండగా మారిన కోదండరాం
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments