అమెరికా ఏమంటోంది?

What America will decide

యావత్ ప్రపంచం ఎన్నికల మూడ్ లో ఉంది. అసలు ఎవరు ఎన్నిక అవుతారు..? దాని వల్ల తమ దేశం పరిస్థితి ఏమవుతుంది..? తమ పిల్లల భవిష్యత్తు ఏంటి ? అనే ఆలోచనలో అందరూ ఉన్నారు. ఇంతకీ ఏంటి అంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. నేటితో తేలిపోనున్న అమెరికా భవితవ్యం, యావత్ ప్రపంచానికి దిశా నిర్దేశం చెయ్యనుంది. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ ల మధ్య జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ఒకరి మీద ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు, విమర్శలు గతంలో ఎన్నడూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇంత రసవత్తరంగా కొనసాగేలా చెయ్యలేదు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డమోక్రటిక్ పార్టీ తరఫున బరిలోకి దిగిన హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ లు తమవంతు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరి క్షణంలో హిల్లరీకి ఈ-మెయిల్ స్కాండల్ లో ఎప్.బీ.ఐ క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో హిల్లరీ క్యాంపు ఫుల్ జోష్ లో ఉంది. ఇక తన రిపబ్లికన్ ప్రత్యర్థి ట్రంప్‌పై హిల్లరీ లైంగిక దాడుల ఆరోపణలు చేయడం కూడా వివా దానికి దారితీసింది. ఇక ట్రంప్ సభలలో పలు చోట్ల భద్రతా కారణాలతో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది.

అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఇంతటి తీవ్ర స్థాయి, ఎటూ తేల్చలేని ఎన్నికల ఘట్టం లేదనే విశ్లేషణ లు వెలువడుతున్నాయి. విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీ ఈ మెయిల్స్‌కు సంబంధించి జరిపిన తనిఖీలలో వివాదాస్పద మెయిల్స్ ఏమీ లేవని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ ఇప్పుడు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను ఎన్నికల్లో తమకు అను కూలంగా మలుచుకునేందుకు హిల్లరీ ప్రచారకర్త టిమ్ కైనే ప్రచారం సాగిస్తున్నారు. అయితే అన్ని సర్వేల్లో కూడా దాదాపుగా హిల్లరీకే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయని వెల్లడించడం జరిగింది. కాగా డొనాల్ట్ ట్రంప్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అందరూ షాక్ అవుతారు అని ఆయన అనడం అందరికీ ఆసక్తిని రేపుతోంది.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
ఆయనకు వంద మంది భార్యలు
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
పోరాటం అహంకారం మీదే
ముద్రగడ సవాల్
పిహెచ్‌డి పై అబద్ధాలు
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
చెబితే 50.. దొరికితే 90
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
బాబును వదిలేదిలేదు
వంద విలువ తెలిసొచ్చిందట!
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments