అమ్మకు ఏమైంది?

What Happened to Jayalalitha

దేశ రాజకీయాల్లో ఎంతో కీలకంగా, తమిళనాట ఆరాధ్య దేవతగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మీద మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న జయలలిత పది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో సీఎం ఆరోగ్య పరిస్థితిపై వదంతులు మొదలయ్యాయి. ఆసుపత్రి తరపు నుండి గానీ పార్టీ తరపు నుండి గానీ ఎటువంటి ప్రకటనా విడుదల కాకపోవటంపై ఆమె ఆరోగ్యపరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గత 24వ తేదీన ఆసుపత్రిలో వైరల్ ఫీవర్ తో జయలలిత అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద ఆమె అభిమానులు భారీగా చేరుకున్నారు. జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని పలు ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నారు. వాటిని నమ్మవద్దని ఏఐఏడీఎంకే నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతుల నేపథ్యంలో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కాగా సోషల్ మీడియాలో ఓ మహిళ జయలలిత ఆరోగ్య క్షీణించిందంటూ పోస్ట్ పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన సదరు మహిళపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని వెంటనే వెల్లడించాలని, లేదంటే వదంతులకు మరింత ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని పలువురు కోరుతున్నారు. కాగా ఆమో ఆరోగ్యం తీవ్రంగా క్షీణించటంతో మెరుగైన చికిత్సకోసం సింగపూర్ తరలిస్తున్నారనే వదంతులు కూడా వ్యక్తమయ్యాయి. కాగా అపోలో ఆస్పత్రి నుండి పత్రికా ప్రకటన విడుదలైంది. అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది అని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది అని అపోలో ఆస్పత్రి అధికారికంగా ప్రకటన చేసింది.

Jaya health

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
బావర్చి హోటల్ సీజ్
గుజరాత్ సిఎం రాజీనామా
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
సౌదీలో యువరాజుకు ఉరి
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
వంద, యాభై నోట్లు ఉంటాయా?
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
తిరిగిరాని లోకాలకు జయ
రాసలీలల మంత్రి రాజీనామా
500 నోటుపై ఫోటో మార్చాలంట
దేశభక్తి అంటే ఇదేనా?
నరేంద్రమోదీ@50 రోజులు
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..

Comments

comments