శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..

What Happening on Every Friday in Kashmir

భూతల స్వర్గంగా పేరేగాంచిన కాశ్మీర్ లో ఎప్పుడూ రక్తపాతమే ఎందుకు..? ఎందుకంటే అది యుద్దం.. అలుపెరుగని  యుద్దం. కాశ్మీర్ లో ఉండే వాళ్లకు ఎప్పుడూ ఓ భయం ఉంటుంది. ప్రతి శుక్రవారం తల్లి తన బిడ్డలు ఇంటికి వచ్చారా లేదా అనే భయం. భార్య తన భర్త ఎలా ఉన్నాడో అనే భయం. ఓ వ్యాపారికి ఎంత నష్టం వస్తుందో అనే భయం. ఓ పోలీస్ అధికారికి ఎవరికి ఏం కాకూడదు అనే భయం. ఇంతలా అక్కడ భయాందోళనలకు కారణం ఓ రోజు. అవును వారానికి ఓ రోజు వచ్చే ఆ రోజు అంటే అందరికి భయం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అని.. ఏం జరుగుతుందో అనే భయం. అసలు కాశ్మీర్ లో శుక్రవారం ఏం జరుగుతుంది..?

ప్రతి శుక్రవారం అన్ని చోట్లలా కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలకు వెళ్లే టైంలో తుఫానుకు ముందు ఉండే నిశబ్దం అలుముకుంటుంది. ఓ పక్కన ముస్లింలు ప్రార్థనలకు సిద్దమవుతుంటే.. మరో పక్క పోలీసులు, భద్రతా బలగాలు తమ తుపాకీలకు, టియర్ గ్యాస్ పిస్టల్స్ ను రెడీ చేస్తుంటారు. మరో పక్క ఈ రెండు వర్గాలను భయపెట్టేందుకు ఓ ముఠా రెడీ అవుతుంటుంది. అది రాళ్లు, ఇనుప సామాన్లు, పాకిస్థాన్ జెండాలు, కుదిరితే ఐసిస్ జెండాలు సిద్దం చేసుకుంటారు. రెండు గంటలకు ముందు నుండి దాదాపుగా రెండు గంటలు సాగే ఈ యుద్దానికి కాశ్మీర్ మొత్తం అట్టుడుకుతుంది. ఒక రోజు అంటే ఏదో అనుకోకుండా జరిగింది అని అనుకోవచ్చు.. మరోసారి జరిగితే ఆందోళన అనుకోవచ్చు కానీ ప్రతి వారం అదే సీన్ రిపీట్ అవుతే దాన్ని ఏమనాలి.

ప్రతి శుక్రవారం కాశ్మీర్ లోని చాలా ప్రాంతాలు ముఖ్యంగా కాశ్మీర్ వ్యాలీ ప్రాంతంలో జరిగే అసాధారణ యుద్దం. ప్రతి మసీదు చుట్టు వేల మంది పోలీసులు పహారా కాస్తున్నా కూడా దుండగులు రాళ్లతో దాడికి దిగుతూనే ఉంటారు. పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు వినిపిస్తుంటాయి.. భారత్ కు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తుంటాయి.  వేల మంది ముసుగులు ధరించి రోడ్ల మీదకు వచ్చి… అక్కడున్న దుకాణాల మీద విరుచుకుపడతారు. పోలీసులు లేదా భద్రతా దళాలకు చెందిన వాళ్లు కనిపిస్తే వెంటనే వాళ్ల మీద రాళ్లతో దాడికి దిగుతారు. ఒంటరిగా పోలీసులు కనిపిస్తే మాత్రం వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. ముసుగులు ధరించి వేల మంది చేసే అరాచకానికి ప్రతి శుక్రవారం సాక్షంగా నిలుస్తోంది.

ప్రార్థనల తర్వాత రోడ్ల మీద రాళ్లు కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి. పోలీసులు ఉండే చోట రాళ్లు, ఆందోళన కారులు ఉండే చోట తూటాలు కనిపిస్తూ మొత్తంగా రక్తం ఏరులై కాశ్మీర్ వీధుల్లో కనిపిస్తుంది. ఆందోళనలకు దిగే చాలా మంది ప్రతి శుక్రవారం పనిగట్టుకు వచ్చి మరీ ఇలాంటి హింస చేస్తున్నారంటే నమ్మకతప్పదు. తాము స్వేచ్ఛను కోరుకుంటున్నామని చేస్తున్న ఈ యుద్దంలో ప్రతిసారి భద్రతా బలగాలకు చెందిన వ్యక్తులు, ఆందోళనకారులు రక్తం చిందుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రతి శుక్రవారం హింస తప్పదు అని పోలీసులకు తెలిసినాకూడా ఎవరూ ఏమీ చెయ్యలేని పరిస్థితి.

శుక్రవారం జరుగుతున్న ఈ హింసకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. కాశ్మీర్ లో నాడు పాకిస్థాన్ తో మొదటి ఇండో పాక్ యుద్దం జరిగినప్పుడు 78శాతం మంది ముస్లింలు ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు 94శాతం మంది ముస్లింలు ఉన్నారు. దాంతో అక్కడ ప్రతి శుక్రవారం వేల సంఖ్యలో ప్రార్థనలకు వెళతారు. కాగా ఈ ప్రార్థనలకు వెళ్లే వాళ్లను అడ్డంపెట్టుకొని ముఠాలుగా ఏర్పడిన దుండగులు హింసకు దిగుతారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎందుకు ఈ శుక్రవారం హింసను అడ్డుకోవడం అనేది కాశ్మీరీలకు ఎన్నటికీ నెరవేరని కలలా మారింది.

కాశ్మీర్ లో ఎప్పుడూ హింసేనా..? శాంతి ఎన్నడూ లేదా..? అని మీకు డౌట్ రావచ్చు. కానీ కాశ్మీర్ లో హింస లేకుండా కూడా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అసలు కాశ్మీర్ లో హింస అనే మాట ఎప్పుడు వినపించలేదు..? దానికి కారణం ఎవరు..? అనే విషయాలను ఏడో భాగంలో తెలుసుకుందాం.

-Abhinavachary

Also Read:

కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది(మొదటి భాగం)

పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..(రెండో భాగం)

కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు(మూడో భాగం)

కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ(నాలుగో భాగం)

కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు(ఐదో భాగం)

Related posts:
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
చిరుకు పవన్ అందుకే దూరం
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
బాబు Khan
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
మీది ఏ జిల్లా? జిల్లాలు- వాటి పరిధి- జిల్లా మ్యాప్‌లు
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఏం చేస్తున్నావ్ సామీ! ఏంది ఈ పాలన
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
జయను ఎందుకు ఖననం చేశారంటే?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ
పవనం అయినా హరికేన్ అయినా తలవంచాల్సిందే

Comments

comments