ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?

What is going on Beach Love issue in Ap

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా లవ్ బీచ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు తాజాగా లవ్ బీచ్ పేరుతో పెట్టుబడులను ఆకర్షించడానికి పెద్ద ప్లాన్ వేశారు. అవును లవ్ బీచ్ పేరుతో పార్ట్ నర్ సమ్మిట్ నిర్వహించి, దాని ద్వారా విదేశీ పెట్టుబడులను రాబట్టాలని ఏపి సర్కార్ ప్లాన్ వేసింది.  అయితే బాబుగారి ప్లాన్ అంతా బాగానే ఉన్నా కానీ విశాఖ బీచ్ లో బికినీలతో ఆటపాట అనేది అందరికి ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

పెట్టుబడులను రాబట్టడానికి ఏపి సర్కార్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.. అనే ప్రచారాన్ని బాగా చేయగలిగారు. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పెట్టుబడులు ఎంతో కీలకం, వాటిని రాబట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది సర్కార్ అని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై సర్వత్రా చర్చసాగుతోంది. ఇంతకీ దీనిపై ఇంతలా చర్చసాగడానికి కారణం ఏంటంటే.. విశాఖ బీచ్ లో విదేశాలకు చెందిన తొమ్మిదివేల జంటలకు ఆతిధ్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ అంటే ముందు నుండి సంసృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. అలాంటి ఏపిలో  చంద్రబాబు నాయుడు బహుశా విదేశీ సంసృతిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఆలోచించి ఉండవచ్చు. కాగా దీనిపై ఓ గాసిప్ కూడా రాజకీయ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. అదేమిటంటే.. నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గతంలో విదేశాల్లో తెగ ఎంజాయ్ చేసిన ఆదారాలున్నాయి. కానీ అలా ఎంజాయ్ చెయ్యాలంటే విదేశాలకు వెళ్లాల్సి వస్తుందని, అలా కాకుండా ఇక్కడే ఓ కార్యక్రమాన్ని ఫారిన్ లో నిర్వహించినట్లు నిర్వహిస్తే సరిపోతుంది కదా అని ఆలోచించారట. దాంతో లవ్ బీచ్ పేరుతో విశాఖ తీరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట.

చంద్రబాబు నిర్వహించాలని అనుకుంటున్న లవ్ బీచ్ వల్ల ఒరిగేదేమీ లేదని అన్ని పక్షాలు వాదిస్తున్నాయి. బీచ్ లో బికినీలు వేసుకుంటేనే పెట్టుబడులు వస్తాయి అంటే అలాంటి పెట్టుబడులు మనకు అవసరం లేదు అని తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బిజెపి ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ఇక వైసీపీ పార్టీ అయితే బీచ్ లవ్ ను అడ్డుకుంటామని ప్రకటించేసింది. ఇలా అన్ని పక్షాలు వద్దంటున్నా కానీ ప్రభుత్వం తరఫున మాత్రం దీన్ని నిలిపి వేస్తామని, లేదంటే ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లు కాదు అని ఎలాంటి ప్రకటన రాలేదు.

పైగా లవ్ బీచ్ కార్యక్రమానికి షకీరా కూడా వస్తోందని, మూడు రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆమె గానబజానా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అందరూ మండిపడుతున్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంటే బాబుగారు ఇలా పిచ్చిపిచ్చి పనులకు ప్రజాధనాన్ని వేస్ట్ చెయ్యడం ఏంటి అని మండిపడుతున్నారు. విశాఖ తీరాన్ని సెక్స్ రాకెట్ కు, డ్రగ్ మాఫియాకు కేరాఫ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు అలా కాకుండా  బీచ్ లో స్పోర్ట్స్ నిర్వహించడంతో టూరిజం డెవలప్ అవ్వడంతోపాటు, పెట్టబడులు కూడా వస్తాయి. మరి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందో లేదొ మరి. మొత్తానికి ఏపిలో లవ్ బీచ్ కార్యక్రమం తీవ్ర దుమారానికే తెర తీసింది. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
పవన్ ను కదిలించిన వినోద్
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
మద్యల నీ గోలేంది..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
దేశం మెచ్చిన జేమ్స్ బాండ్.. ధోవల్ అంటే పాక్ హడల్
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
జగన్ క్రిస్టియన్ కాదా!
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
పవన్ క్షమాపణలు చెప్పాలి
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
మోదీ భజన అందుకేనా?
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments