మీకో దండం.. ఏం జరుగుతోంది?

What is the exact situation in Ap

ఏపిలో పాలన వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనను గాడినపెట్టలేకపోతున్నారు అన్నది వాస్తవం. గత ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డైలమాలో ఉంది. మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎటూపాలుపోని విధంగా మారింది. అసలు పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా ఆయనకు అర్థంకాని పరిస్థితి. అసలు ఏపిలో ఏం జరుగుతోంది…? చంద్రబాబు ఏం చేస్తున్నారు..? అనే అన్ని ప్రశ్నలకు ఈ ఆర్టికల్ లో సమాధానాలు రాశాం.

విభజన తర్వాత ఏపి కష్టాలను కడతేర్చే నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు పట్టంకట్టారు. అయితే అధికారం చేపట్టినప్పటి నుండి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, తీసుకువస్తున్న పథకాలు ప్రజలకు ఎంత మాత్రం రుచించడం లేదు. చంద్రబాబుకు కేబినెట్ పై అసంతృప్తి బాగా పేరుకుపోయింది. ఇక కింది స్థాయి నాయకులకు ఎలాంటి పదవులు లేక నిరుత్సాహంగా ఉన్నారు. ప్రత్యేక హోదాపై పార్టీ వైఖరి, చంద్రబాబు తీరు అర్థం కాక కార్యకర్తలు కూడా ముందుకు వెళ్లలేకపోతున్నారు.

ఇక ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఇలా అన్ని వర్గాల నుండి అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ఎలా పాలనను అందిస్తున్నాడో అని అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుకు ముందుగా తన కేడర్ భయం పట్టుకుంది. గతంలో తాను తీసుకున్న నిర్ణయాల వల్ల అధికారానికి తొమ్మిదేళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. మరోసారి అదే తప్పు చెయ్యకూడదు అని… చేతిలో అరటిపండుగా తన అధికారాన్ని వాడుకుంటున్నారు. అయితే ఇదే అందరికి అలుసుగా మారింది.

చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఆయన వైఖరిని వాడుకునే మంత్రులు కొంత మంది ఉంటే, మరి కొందరు మాత్రం తమకు ఏం పట్టదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు మంత్రుల మీద పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శించలేక… వారిని వెనకేసుకురావాల్సి వస్తోంది అన్నది వాస్తవం. మంత్రులు తప్పులు చేసినా, తప్పుడు పనులకు మంత్రులు వత్తాసు పలికినా ఆయన మాత్రం దాన్ని వ్యతిరేకించకపోవడానికి కూడా ఇదే కారణం.

Also Read:  చెత్త టీంతో చంద్రబాబు

ఇక కొంత మంది మంత్రులు అయితే తమ పరిధిలో మంత్రిత్వ శాఖ ఏం పని చేస్తుందో కూడా తెలియనట్లు ఉంటున్నారు. మంత్రులు ఇలా ఉంటే కనీసం నాయకులు అయినా బలంగా, చంద్రబాబుకు అండగా ఉన్నారనుకోవడానికి కూడా వీలులేదు. ఎందుకంటే పార్టీ వైఖరితో, చంద్రబాబు ప్రవర్తనతో చాలా మంది విసుగుచెందారు అని తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల్లో పార్టీ మీద తీవ్రంగా అసంతృప్తి ఉంది అని టాక్. చంద్రబాబు కేవలం గుంటూరు, విజయవాడలను మాత్రమే పట్టించుకుంటున్నారని, మిగిలిన వాటిపై పెద్దగా పట్టింపులేదు అని పార్టీ వర్గాల్లో చర్చ.

ఇదే అదును చాలా మంది చంద్రబాబు తర్వాత నెంబర్ టూ అనే బిల్డప్ కోసం తాపత్రయపడుతున్నారు. నారా లోకేష్ పార్టీలో కాస్త కీలకంగా కనిపించినా చాలా మంది ఆయనను చంద్రబాబు తర్వాత రెండో నెంబర్ లీడర్ అంటే నమ్మడం లేదు. చంద్రబాబు నాయుడు తయారు చేసిన పేపర్ పులి నారా లోకేష్ అని చాలా మంది భావిస్తున్నారు. అందుకే నెంబర్ టూ కోసం మంత్రి నారాయణ తీవ్రంగా కష్టపడుతున్నారని… అందుకే అమరావతి బాధ్యతలను ముందుండి నడిపిస్తున్నారని అందరికి తెలుసు.

Also Read: ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’…. ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు

చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లితే అసలు పాలనను ఎవరు ముందుండి నడిపిస్తారు అంటే ఒక్క పేరు కూడా వినిపించదు. తెలుగుదేశం అంటే ఓ రాజకీయ పాఠశాల. ఎంతో మంది ఈ పాఠశాల నుండి వెళ్లారని చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు వెల్లడించారు. కానీ ఇప్పుడు అదే పాఠశాలలో ప్రిన్సిపాల్ లేకుండా పోయింది. నిన్నటి దాకా పాలనను గాడిలో పెట్టలేకపోవడానికి కారణం సెక్రటేరియట్ వేరే చోట, తాను వేరే చోట ఉండటం అంటూ అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. వెలగపూడికి సెక్రటేరియట్ వచ్చేసింది… కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నాయకత్వం మీద పార్టీ క్యాడర్ కు క్లాసులు నిర్వహిస్తున్నారు. అసలు పార్టీలో, పాలనలో ఏం జరుగుతుందో అర్థం కాని చంద్రబాబు.. ఇలా నాయకత్వం పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నారు అని జోకులు కూడా పేలుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
పవన్ ను కదిలించిన వినోద్
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
మద్యల నీ గోలేంది..?
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
రాజధాని పిచ్చిలో నియోజకవర్గాల నిర్లక్ష్యం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
బాబుకు అవకాశం లేదు... కేసీఆర్ కు తిరుగులేదు
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు

Comments

comments