ఏబీఎన్ సర్వేలో మ్యాటర్ ఏంటి?

What is the reason behind ABN AndhraJyothy survey

మీడియా అంటే వాస్తవాలను, విశ్లేషణలను అందించాలి. అలాంటి వాస్తవాలను కాస్త వక్రీకరిస్తూ కొన్ని మీడియా ఛానల్స్ అతిగా చేస్తుంటాయి. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది.  అయితే ఆ సర్వే వివరాలు మాత్రం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఏబీఎన్ సర్వే ప్రకారం ఏపిలో చంద్రబాబు నాయుడుకు తిరుగులేదు.. పైగా ఎన్నికల టైం కంటే ఇప్పుడు బాబు గారు మరింత ఓటుబ్యాంకు పెరిగింది అని తన సర్వేలో నొక్కివక్కానించింది.

ఏబీఎన్ స‌ర్వే ప్రకారం ఏపిలో చంద్ర‌బాబుకి తిరుగులేదు… ఇంకా చెప్పాలంటే ఆయ‌న మ‌రింత బ‌ల‌ప‌డ్డారు. గ‌డిచిన ఎన్నిక‌ల కంటే విప‌క్షం(వైసీపీ) బాగా బ‌ల‌హీన‌ప‌డింది. దాంతో టీడీపీ బీజేపీ కూట‌మికి 46.53 శాతం ఓట్ల‌తో ఏకంగా 120 స్థానాలు ద‌క్కించుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో బీజేపీతో స్నేహాన్ని విడ‌గొట్టుకుంటే టీడీపీకి మ‌రింత ప్ర‌యోజ‌నం ద‌క్క‌బోతోంది. టీడీపీ ఒంట‌రిగా సాధించే సీట్ల సంఖ్య 140కి పెరుగుతంది. వైఎస్సార్సీపీ బ‌లం టీడీపీ, బీజేపీ కూట‌మిగా ఉంటే 36.80 శాతం ఓట్ల‌తో 50 సీట్లు సాధిస్తుంది. అదే టీడీపీ ఒంట‌రిగా పోటీ చేస్తే మాత్రం వైఎస్సార్సీపీకి కేవ‌లం 30 సీట్లు మాత్ర‌మే ద‌క్కుతాయి.

కాంగ్రెస్ కి 6.1 శాతం ఓట్లు, క‌మ్యూనిస్టుల‌కు 2.9 శాతం ఓట్లు ద‌క్కుతాయ‌ని ఏబీఎన్ స‌ర్వే అంచ‌నా వేసింది. ఇక టీడీపీ గెలుచుకునే స్థానాల‌లో టెక్క‌లి, సాలూరు, విశాఖ ఉత్త‌రం, కాకినాడ‌, ముమ్మిడివ‌రం,ఉంగుటూరు, కైక‌లూరు, నందిగామ‌, గుంటూరు వెస్ట్, ద‌ర్శి, కోడుమూరు, అనంత‌పురం అర్బ‌న్, తిరుప‌తి త‌దిత‌ర స్థానాల‌ను టీడీపీ, బీజేపీ కూట‌మి సాధిస్తుంద‌ని ఏబీఎన్ సర్వే అంచ‌నా వేశారు. వైఎస్సార్సీపీ త‌రుపున రంప‌చోడ‌వ‌రం, పాయ‌క‌రావు పేట‌, క‌ర్నూలు, పీలేరు, పూత‌ల‌ప‌ట్టు, మైదుకూరు, ఉద‌య‌గిరి స్థానాలు గెలుచుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అయితే బీజేపీతో పొత్తు వీడిపోతే మాత్రం వైఎస్సార్సీపీ నుంచి పాయ‌క‌రావు పేట‌, రంప‌చోడ‌వ‌రం, ఉద‌య‌గిరి, క‌ర్నూలు స్థానాల‌ను కూడా టీడీపీ గెలుచుకుంటుంద‌ని 20-30 స్థానాల‌తో సంపూర్ణ ఆధిక్యం సాధిస్తుందని తెలిపింది.

ఏబీఎన్ సర్వేలో గమనించాల్సింది ముందుగా మొత్తం సర్వే బిజెపిని టార్గెట్ చేస్తూ సాగింది. బిజెపి వల్ల టిడిపికి నష్టమే కలుగుతుంది తప్పితే మీసమెత్తు లాభం కూడా లేదు అని తేల్చింది. బహుశా ఏపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీని బిజెపి నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు. అయితే బిజెపి వల్ల టిడిపికి నష్టం అనేదాంట్లో చాలా వరకు వాస్తవం ఉండదు. కానీ బిజెపి టిడిపి పొత్తు లేకుంటే వైసీపీ నష్టం అనేది మాత్రం వాస్తవ విరుద్ధం.ఏబీఎన్ సర్వేపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు. ఏబీఎన్ సర్వే ఓ బూటకం అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏబీఎన్ సర్వేతో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.అందులో మొదటిది అసలు బాబుకు ప్రజాదరణ పెరిగిందా? లేదా అనే విషయంపై ఇప్పుడు సర్వే చెయ్యాల్సిన అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది? బహుశా చంద్రబాబు నాయుడు అండ్ క్యాడర్ లో సర్వేల్లో తాము బలం కోల్పోతున్నాం అనే ఆత్మనూన్యత నెలకొన్ని నేపథ్యంలో ఏబీఎన్ లాంటి స్వామి భక్తి ఛానల్స్ సర్వేతో కాస్త ఉత్సాహపరుద్దాం అని అనుకుని ఉండవచ్చు. చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి సర్వేలో తెలుగుదేశం పార్టీకి కేవలం 57 సీట్లు మాత్రమే వస్తాయని తేలితే, ఏబీఎన్ ఛానల్ సర్వేలో మాత్రం 140 సీట్లు ఎలా వస్తాయని అనుకుంటున్నారు. ఇప్పటి దాకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద చేసిన అన్ని సర్వేల్లోనూ బాబుకు ఎదురుగాలి అని తేలితే.. ఒక్క ఏబీఎన్ సర్వేలో మాత్రం బాబుకు తిరుగులేదు అని ఎలా తేలింది? ఇవన్నీ చదవిన తర్వాత ఎవరికైనా ఏబీఎన్ సర్వే ఎంత పారదర్శకంగా జరిగిందో అర్థమవుతుంది.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
ఇదే జగ‘నిజం’
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?

Comments

comments