అమ్మ పరిస్థితి ఏంటి?

What is the situation in Tamilnadu

తమిళనాడులో ఉద్రిక్త, ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి, అమ్మ జయలలిత ఆరోగ్యం విషమించడం తమిళనాట విషాదచాయలు నింపింది.  సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత దాదాపు కోలుకుంటున్నారని,  ఇంక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా ఇంతకుముందు అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి చెప్పారు. కానీ అంతలోనే మళ్లీ అమ్మ ఆరోగ్యం విషమించింది.

గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోసం తాము దేవుడిని ప్రార్థిస్తున్నామని, తమతో పాటు అందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిన జయలలిత  గుండె, ఊపిరితిత్తులకు ప్రత్యేక పరికరాలతో మద్దతు అందిస్తున్నామని చెప్పాయి.  ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి పలు ట్వీట్లు చేసింది. ఆమెకు ‘ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్’ అమర్చామని, పలువురు నిపుణులైన వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ఇప్పుడు ఆమెకు ఏ తరహా చికిత్స అందించాలన్న విషయమై లండన్‌కు చెందిన వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలేని కూడా సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరింది.

తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ప్రముఖులు ట్విట్టర్ లో సందేశాలను పోస్ట్ చేశారు. గుండెపోటు రావడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మ త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థిస్తామంటూ ప్రధాని మోదీ ట్వీట్టర్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు. జయలలితకు గుండెపోటు రావడం బాధాకరం. ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ రాష్ట్రపతి ప్రణబ్ ట్వీట్ చేశారు. అతి త్వరలో ఆమె కోలుకుని ఆస్పత్రి నుంచి తిరిగొస్తారని ఆశిస్తున్నానంటూ కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సెలవుల్లో ఉన్న వారిని వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. తమిళనాడులో మండల స్థాయి నుంచి భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సరిహద్దు ప్రాంతాలు, టోల్ ప్లాజాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తమిళనాడుపై పోలీసులు నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, కేంద్ర బలగాలను మోహరించారు. అపోలో ఆస్పత్రికి 6 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటళ్లను, దుకాణాలను పోలీసులు మూసివేయించారు. అపోలో ఆస్పత్రి వైపుకు దూసుకువస్తున్న అన్నాడీఏంకే కార్యకర్తలను పోలీసులు నిలువరిస్తున్నారు.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
చంద్రబాబు చిన్న చూపు
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
గాలిలో విమానం.. అందులో సిఎం
ఆ పెళ్లి గురించి మోదీకి తెలుసా?
తిరిగిరాని లోకాలకు జయ
జయ మరణం ముందే తెలుసా?
చంద్రలోక్ కాంప్లెక్స్ సీజ్
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments