మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?

What KCR will discuss with Modi

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో కలకలం రేగింది. మోదీ తీసుకున్న నిర్ణయంతో జనాలు బ్యాంకులకు క్యు కట్టారు. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదో తేదీ ఎనిమిది గంటలకు ప్రకటించారు. దాంతో సగటు జీవి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాగా రాష్ట్రాల పరిస్థితి కూడా దారుణంగా మారింది. చాలా రాష్ట్రాల్లో ఖజానాలో డబ్బులులేక తీవ్ర  ఇబ్బందిపడుతున్నారు. అందులో వార్తల్లో నిలుస్తున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ నిర్ణయం మీద కినుకువహించారని వార్తలు వస్తున్నాయి. అయితే మోదీ నుండి కేసీఆర్ కు ఫోన్ వచ్చిందని, పరిస్థితిపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అసలు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అన్నది వార్తల్లో నిలుస్తోంది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణ‌యం తెలుగు రాష్ట్రాల‌కు పెద్ద దెబ్బ‌. ఇపుడిపుడే కోలుకుంటున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను వెన‌క్కి లాగిన‌ట్లైంది. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో ఏపీ, తెలంగాణ‌లోని చాలా రంగాలు కుదేల‌య్యాయి. ముఖ్యంగా తెలంగాణ‌లో ప‌రిస్థితి మ‌రీ దారుణం. రాబ‌డిలో టాప్‌లో నిలిచే హైదరాబాద్ నుంచి చిల్లిగ‌వ్వ రాల‌డం లేదు. రియాల్టీ దెబ్బ‌తింది. రిజిస్ట్రేష‌న్లు ఆగిపోయాయి. లిక్క‌ర్ సేల్స్ ప‌డిపోయాయి.. ఇలా అదీ.. ఇదీ అని కాకుండా అన్ని రంగాల్లో భారీ కుదుపు జ‌రిగింది. ఈ దెబ్బ‌తో నెల‌కు రాష్ట్ర ఖాజాన‌కు రెండు వేల కోట్ల న‌ష్టం వాటిల్లితున్న‌ట్లు ప్రాథ‌మిక అంచ‌నా. ఈ అంచ‌నా ఇపుడు స‌ర్కార్ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది.

ఇప్ప‌టికే ఉద్యోగుల‌కు ఫుల్ శాల‌రీలు డౌటేనంటూ క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం క‌ష్ట‌మేనంటున్నారు. కానీ ఒక్క తెలంగాణ మీదే అంత దెబ్బ ఎందుకు ఉంది. స‌ర్కార్ ఎందుకు వ‌ణికిపోతోంది.అంటే చాలా లెక్క‌లే ఉన్నాయి. రియాల్టీ ఇపుడిపుడే ఊపందుకుంటోంది. రాబ‌డి పెరుగుతోంది. ఇపుడీ నిర్ణ‌యంతో దానికి ఉహించ‌ని దెబ్బ త‌గిలింది. హైద‌రాబాద్, శివార్ల‌లో రియ‌ల్ మార్కెట్ స్త‌బ్ధుగా మారింది. ఇక కొత్త జిల్లాల్లోనూ రియ‌ల్ రంగం ఒక్క‌సారిగా పెరిగింది. జిల్లా కేంద్రాల‌లో ఇపుడిపుడే రిజిస్ట్రేష‌న్ల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ నిర్ణ‌యంతో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఇక జ‌నాల ద‌గ్గ‌ర క్యాష్ లేక నిత్య‌వ‌స‌ర స‌రుకులు కొన‌డమే గ‌గ‌న‌మైంది. ప్ర‌తి సారి గంట‌ల కొద్దీ క్యూలైన్ల‌లో వేచి చూడ‌లేక‌పోతున్నారు. అటూ వాహ‌నాల రిజిస్ట్రేష‌న్లు, కొనుగోళ్లు ప‌డిపోయాయి. లిక్క‌ర్ సేల్స్ ప‌డిపోయాయి. మాల్స్ దెబ్బ‌తిన్నాయి. థియేట‌ర్ల‌లో జ‌నాల్లేరు. ఇలా ప్ర‌భుత్వానికి ప‌న్నుల ద్వారా వ‌చ్చే ప్ర‌తి రాబ‌డి ప‌డిపోయింది. నేల చూపులు చూస్తోంది. మ‌రి ఇలాంటి స‌మయంలో తెలంగాణ ఆర్థిక ప‌రిస్థితి గ‌తి ఏంటి..? రెండు మూడు రోజుల్లో చ‌క్క‌బ‌డే వ్య‌వ‌హారం కాదిది.. క‌రెక్ట్‌గా సెట్ కావాలంటే ఇంకా చాలా టైమ్ ప‌డుతుంది. అందుకే ఈ లెక్క‌ల‌న్నీ ప్ర‌ధానికి వివ‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు కేసీఆర్‌. ఢిల్లీ వెళ్తున్న సీఎం.. ప్ర‌ధానిని క‌లుస్తారు. మ‌రి పెద్ద‌నోట్ల ర‌ద్దుపై ఆయ‌న్ను క‌డిగేస్తారో.. లేక ఆయ‌న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తిచ్చి క‌లిసిపోతారో.. చూడాలి.

కేసీఆర్ మోదీతో భేటీలో కొన్ని కీలక సూచనలు చెయ్యనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండున్నర లక్షలు మించిన డబ్బులు కలిగిన ప్రతి ఒక్కరిని నల్లధనం కలిగిన వ్యక్తులుగా కాకుండా కేవలం లెక్కలోకిరాని నగదు(అన్ అకౌంటెడ్ మనీ)గా పరిగణించాలని ఆయన సూచించనున్నారట. చిన్న, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడకుండా, చిల్లర వ్యాపారం చేసుకునే వారికి కూడా కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను వాయిదా వెయ్యాలని కూడా ఆయన కోరతారని సమాచారం.

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ చంద్రుడి చక్రమే
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
తొక్కితే తాటతీస్తారు
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments