మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?

What Modi is doing is right or wrong on Currency

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఒక్క నిర్ణయం దేశం మొత్తం అతలాకుతలమైంది. సామాన్యుల దగ్గరి నుండి బడాబాబుల వరకు అందరూ కూడా వణికిపోయారు. మోదీ తీసుకున్న ఆ నిర్ణయం అందరిని ఆలోచనలోపడేసింది. దేశంలో చాలా మంది మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోయినా కూడా, తమకు జరుగుతున్న అసౌకర్యం మీద మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద నోట్లను బ్యాన్ చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంతో బ్లాక్ మనీ వెలుగులోకి వస్తుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ డబ్బులున్న బడాబాబులకన్నా కూడా సామాన్య జనాలు కష్టాలుపడుతున్నారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని ఎటు తీసుకెళుతుందో తెలుగోడ ప్రత్యేకంగా విశ్లేషిస్తోంది.

పన్నులు కట్టకుండా, అక్రమంగా సంపాదించిన డబ్బులను ట్రంకు పెట్టెల్లో నిల్వ ఉంచుకున్న నల్లడబ్బులుగా దాచుకున్నారు. అయితే ఈ దాచుకున్న డబ్బులను ఎక్కువ వ్యాల్యూ ఉన్న కరెన్సీగా మార్చడం జరిగి ఉంటుంది. అయితే ఇలా ఉన్న వ్యాల్యూ కరెన్సీని మోదీ బ్యాన్ చెయ్యడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మోదీ తీసుకున్న నిర్ణయంతో మామూలు జనాలు కూడా తమ అకౌంట్ లోని డబ్బులను డ్రా చేసుకోవాలంటే కూడా క్యులో నిలబడి, ఐడీ కార్డు చూపించి డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మోదీ తీసుకువచ్చిన కొత్త నోట్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెన్సీని బ్యాన్ చేయడం అనే పెద్ద అంశాన్ని మోదీ అకస్మాత్తుగా తీసుకోవడం వల్ల మామూలు జనాల దగ్గరి నుండి బడాబాబుల వరకు అందరూ ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు చిల్లర లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. ఇంట్లోకి సరుకులు తీసుకురావడానికి కూడా చిల్లర కరెన్సీలేకపోవడంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.

నిజానికి మోదీ విజన్ మంచిదే కానీ దాన్ని ఆచరణలో పెట్టిన తీరు సరిగాలేదు. క్యాష్ లెస్ సిస్టంకు మోదీ అంకురార్పణ చేశారు. గతంలో మోదీ ప్రారంభించింన జన్ ధన్ యోజన కింద ఉన్న అకౌంట్ల ద్వారా పేదలకు బ్యాంకు సేవలు అందిస్తున్నారు.అయితే నిజానికి దేశంలొ బ్యాంకింగ్ సేవలు అందుకున్న వారి శాతం కేవలం 40 నుండి 45 శాతం మాత్రమే ఉండటంతో ఇబ్బంది తలెత్తింది. అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా డబ్బు సరఫరాకావడానికి ఆస్కారం కల్పించేందుకు మోదీ శుభారంభం చేశారు.

మోదీ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఎలాగూ మద్దతు తెలుపుతున్నారు. మోదీ చేసింది తప్పు అని సుప్రీంకోర్టుకెక్కినా కానీ కోర్టు కూడా అది కాదు అని తెలిపింది. కేవలం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడమని మాత్రమే సుప్రీంకోర్టు తెలిపింది. అయితే మోదీ చేసిన దాన్ని ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముందుగా మోదీ మాట్లాడుతూ.. ఆరు నెలల నుండి చాలా జాగ్రత్తగా, దొంగచాటుగా డబ్బులు ముద్రించినట్లు అన్నారు. కానీ రెండు నిలల క్రితం వచ్చిన ఆర్.బి.ఐ గవర్నర్ ఉర్జిత్ పాటిల్ సంతకం ఉండటం మీద కాంట్రవర్సీ నడుస్తోంది.

మోదీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది. దేశంలో చాలా వరకు క్యాష్ తోనే పనులు జరుగుతాయి. కానీ మోదీ నిర్ణయం వల్ల కేవలం ఆన్ లైన్ గురించి తెలిసిన వాళ్లు మాత్రమే లాభపడుతున్నారు. మరి ఏటీఎంలలో డబ్బులు పెట్టాం వెళ్లి తెచ్చుకోండి.. అంటే వాళ్లకసలు ఏటీఎం అంటే కూడా తెలియదు మరి వాళ్లు ఎలా తీసుకుంటారు??? అనేది ప్రశ్నే. ఇక మరో ఆరోపణ కూడా ఉంది. బిజెపికి చెందిన కొంత మందికి, అంబాని, అదానీలకు కరెన్సీ గురించి ముందే తెలుసు అనే వార్త కూడా వినిపిస్తోంది.

దేశ ప్రధానిగా, దేశ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా మోదీ తీసుకున్న నిర్ణయం కరక్టే కానీ ఆచరణలో మామూలు జనాలకు కూడా ఇబ్బంది కలుగుతుండటం ప్రతిపక్షాల వాదనలకు బలం చేకూరుస్తోంది. మోదీ నిజానికి తన మీద ఎంత వత్తిడి ఉందో, తాను ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా గోవా సభలో వివరించాడు. తాను పులి మీద స్వారీ చేస్తున్నానని, పులి దిగితే తనకు ప్రాణగండం ఉంది అని కూడా ఆయనకు తెలుసు. తనను నిలువునా కాల్చివేసినా కానీ తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదని కూడా మోదీ వెల్లడించారు.

దేశంలో నకిలీ కరెన్సీ, పెద్ద కరెన్సీ మొత్తం బ్యాంకులకు చేరుతోంది. నిజానికి ఓ బలమైన ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులే ఆధారం. అలా బ్యాంకులకు దాదాపుగా 16 లక్షల కోట్లు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేవలం 14లక్షల 20 వేల కోట్ల ఐదు వందలు, వెయ్యి నోట్లను బ్యాంకులకు రప్పించాలి అన్నది మోదీ ప్లాన్. నిజానికి దేశంలో 14 లక్షల 20 వేలకు మించిన ఐదు వందలు, వెయ్యి నోట్లు ఉన్నాయి. అదంతా కూడా లెక్కలోలేకుండా ఉన్నాయి. కాబట్టే మోదీ దీనిపై కొరడా ఝులిపించారు. దేశం అభివృద్ధి చెందాలి అంటే ముందుగా దేశంలో అవినీతి సొమ్ము ఉండకూడదు. ప్రతి రూపాయి బ్యాంకును చేరి, తిరిగి ప్రజల వద్దకు ఆ రూపాయి చేరితే అభివృద్ధి ఫలాలు అందరికి అందుతాయి. మోదీ ఆశిస్తున్న, భారతదేశం ఎన్నో తరాలుగా కంటున్న ఆ కల నెరవేరాలని కోరుకుంటున్నాం.

Related posts:
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
సింధూరంలో రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
చిరుకు పవన్ అందుకే దూరం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పట్టిసీమ వరమా..? వృధానా..?
14వ ఫైనాన్స్ కమీషన్ ఎలా ఆలోచించింది..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ఇక యుద్ధమే కానీ..
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
పిట్టల దొరను మించిన మాటల దొర
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
పైసలు వసూల్ కాలేదుగా..
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments