మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?

What Narendra Modi discussed with KCR and Governor Narasimhan

మోదీ ఇప్పుడు దేశం మొత్తంలో అందరూ మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్. అలాంటి మోదీ ఓ ఇద్దరిని పక్కకు తీసుకెళ్లి పది నిమిషాలు మాట్లాడారు అంటే ఎలా ఉంటుంది. అవును జాతీయ మీడియాతో సహా అన్ని మీడియా ఛానల్స్ లో ఒకటే స్ర్కోలింగ్. వారిద్దరితో మోదీ ఏం మాట్లాడారు? అని. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. అవును 51వ డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన ప్రధానమంత్రికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ మంత్రులు ఘనస్వాగతం పలికారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకున్న సందర్భంగా ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రులు – బీజేపీ నేతలను పరిచయం చేసుకున్న తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ భుజంపై చేయి వేసిన ప్రధానమంత్రి అక్కడి సమూహం నుంచి పక్కకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ కూడా వెంట ఉండగా కొద్దిసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ప్రత్యేక భేటీలో బహుశా పెద్ద నోట్ల రద్దు విషయం ప్రస్తావనకు వచ్చినట్లు భావిస్తున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్ ను ప్రధానమంత్రి మోడీ వెంట బెట్టుకొని వెళ్లి మరీ ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది.

Related posts:
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
వీళ్లకు ఏమైంది..?
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
ముద్రగడ సవాల్
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
సల్మాన్ ను వదలని కేసులు
బాకీలను రద్దు చేసిన SBI
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
జియో భారీ ఆఫర్ తెలుసా?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
బాబుకు గడ్డి పెడదాం
ఛాయ్‌వాలా@400కోట్లు
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments