పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?

What narendra Modi doing for our Nation

దగ్గు వస్తోందా..? జిందాతిలిస్మాత్.. జలుబు చేసిందా..? జిందాతిలిస్మాత్.. జ్వరంగా ఉందా? జిందాతిలిస్మాత్ ఇలా అన్నింటికి జిందాతిలిస్మాత్ ఎలా అయితే పనిచేస్తుందో బిజెపి చెప్పే ప్రతి అంశంలో మోదీ ఉంటాడు. దేశంలో అభివృద్ధి జరగాలంటే మోదీ రావాలి.. దేశంలోకి పెట్టుబడులు రావాలంటే మోదీ రావాలి.. దేశంలో మహిళలకు రక్షణ కావాలంటే మోదీ రావాలి.. విదేశాల్లో నల్లధనం ఇండియాకు తిరిగి రావాలంటే మోదీ రావాలి. ఇలా అన్నింటికి మోదీ మందు వేస్తోంది బిజెపి.తాజాగా పెద్ద నోట్ల రద్దు విషయంలోనూ అదేబాణి అందుకుంది. సరే దాని గురించి పక్కన బెడితే మోదీ భజన మండలి పెద్ద నోట్ల రద్దుతో తెగ హడావిడి చేస్తోంది.

మోదీని ఓ సూపర్ పిఎంగా చూపించే ప్రయత్నం చేస్తోంది. బిజెపిలాంటి సంప్రదాయ పార్టీలో మోదీ తీసుకువచ్చిన మార్పు ముందు ఇది నిజంగా దిగదుడుపే. వ్యక్తి పూజను వ్యతిరేకించే బిజెపి కూడా గత ఎన్నికల్లో మోదీ పూజతోనే అధికారంలోకి రావాల్సి వచ్చింది. మోదీ రాజకీయ చతురత ఏ స్థాయిలో ఉందో ఇక్కడే అర్థమవుతుంది. ఇక తాజాగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ మోదీ చేసిన ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మోదీ భజన మండలి దీన్ని విపరీతంగా ప్రచారం చేస్తోంది. మీడియా కూడా ఉడతా సాయంగా వంత పాడుతోంది. సరే మోదీ చేస్తున్నది ఎంతో కొంత శాతం మంచే అయివుండవచ్చు కానీ ఇక్కడ సామాన్యుల కష్టాలను కూడా గుర్తించాలి.

ముందుగా చెప్పుకోవాల్సింది నల్లధనం విదేశాల నుండి వంద రోజుల్లో తీసుకువస్తానని హామీనిచ్చిన మోదీ విదేశాలను వదిలి స్వదేశీ ధనం గురించి ఎందుకు అంతలా ఆరాటపడుతున్నారు. ఇంట్లో పందికొక్కులున్నాయని ఇంటిని తగలెడతామా..? కానీ మోదీ మాత్రం అదేపని చేశారు. నల్లకుబేరుల దగ్గరి నుండి నల్లధనాన్ని వెలికితియ్యాలి అంటే ఖచ్చితంగా ఇదే చెయ్యాలి అని అంటున్నారు. పైగా ఈ నిర్ణయానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్లను దేశద్రోహుల ముద్ర వేస్తున్నారు. అయినా మోదీ చేసిన ప్రతి పనికి వంత పాడితే దేశభక్తుడు లేదంటే దేశద్రోహి అంటే ఎలా మరి?

మోదీ తీసుకున్న నిర్ణయం ఓ సంచలనమే. మోదీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి దైర్యం ఉన్నోడే అని అందరికి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 25పైసలను మాత్రమే రద్దు చెయ్యగలిగితే మోదీ మాత్రం ఏకంగా వెయ్యి, ఐదు వందల నోట్లను రద్దు చేశాడు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మోదీని భుజాల మీద ఆకాశానికెత్తిన వాళ్లు ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వాలి.

– యుపిఎ ప్రభుత్వం నాడు 2005కు ముందు పెద్ద నోట్లను(ఐదు వందలు, వెయ్యి నోట్లు) దశల వారిగా రద్దుచేస్తామని ప్రతిపాదిస్తే, బిజెపి, బిజెపి మిత్రపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయి?
* 2005కు ముందు ముద్రించిన నోట్లను దశల వారిగా రద్దు చేసి, వాటి స్థానే కొత్త నోట్లను తీసుకువద్దామని నాటి యుపిఎ ప్రభుత్వం ప్రతిపాదిస్తే దాన్ని బిజెపి వ్యతిరేకించింది. కానీ మోదీ మాత్రం రాత్రి పూట ఒకే ఒక్క ప్రకటనతో పెద్ద నోట్లను రద్దు చేసేశాడు.
– పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం అంతమవుతుందని చెప్పిన మోదీ ఎందుకు రెండు వేల రూపాయల నోటును తీసుకువచ్చారు?
* పెద్ద నోట్లను రద్దు చేస్తే నల్లధనం చాలా వరకు బయటకు వస్తుంది అని ముందు నుండి వినిపిస్తున్న వాదన. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… పెద్ద నోట్లను ముందు వ్యతిరేకించిన బిజెపి నాయకులు ఏకంగా రెండు వేల నోట్లను ఎలా సమర్థించుకుంటారు?
– 1998లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న టైంలో అంతకు ముందు 1978లో రద్దు చేసిన వెయ్యి నోటును తిరిగి ముద్రించారు. నాడు ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఓ ప్రకటన చేశారు. ‘‘పెద్ద నోట్ల వల్ల మాత్రమే నల్లధనం వస్తుందని అనడం సరైనది కాదు’’ అని అన్నారు. మరి మోదీ ఆ ప్రకటనను గుర్తుపెట్టుకోలేదా?
– పెద్ద నోట్లను రద్దు చేస్తున్నాం.. ఇక అవి చిత్తు కాగితాలకు కూడా పనికిరావు అని మోదీ ప్రకటన చేసిన నల్లధనం కలిగిన బడాబాబుల కన్నా బడుగుల జీవులకు అతికష్టం అని తెలియదా?
* బ్యాంకుల్లో, చలామణిలో కూడా పెద్ద నోట్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి వాటిని రద్దు చేస్తే కనీసం ప్రజల అవసరాలు తీరేలా అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. రోజుకు రెండున్నర వేల రూపాయలు డ్రా చేసుకునేందుకు పరిమితి విధించారు. ఇంట్లో ముసలి వాళ్ల దగ్గరి నుండి, ఉద్యోగుల వరకు అందరూ బ్యాంకుల ముందు క్యు కట్టారు. మరి వీరి ఇబ్బంది గురించి మోదీ పట్టించుకోలేదు ఎందుకు?
– చిల్లర దందాలు చేసే వాళ్లకు పెద్ద నోట్ల రద్దుతో ఎంత ఇబ్బంది కలుగుతోందో మోదీ అంచనా వెయ్యలేదా?
– రబీ సీజన్ సమీపించింది.. ఇప్పుడు పొలాల్లో రైతులు పంటలు వెయ్యాలి. కానీ చేతిలో చిల్లిగవ్వాలేదు.. అప్పిచ్చే వాడిదగ్గర పెద్ద నోట్లున్నాయి.. బ్యాంకులు అన్నీ బిజీగా ఉన్నాయి. మరి రైతులను మోదీ వచ్చి ఆదుకుంటారా?

అయినా మోదీ చెబుతున్న నల్లధనం అంటే పాత కాలంలోలాగాబీరువాల్లో, దుప్పట్ల కింద, ట్రంకు పెట్టెల్లో పెట్టుకునే రోజులు ఎప్పుడోపోయాయి. నల్లకుబేరులు కూడా అప్ గ్రేడ్ అయ్యారు.వాళ్లు డబ్బును డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా పోగేసుకుంటున్నారు. కార్పోరేట్ కంపెనీలు అయితే కోట్ల రూపాయలను తమ ఉద్యోగులకు ముందుగానే జీతాలుగా ఇచ్చేస్తున్నాయి. ఇలా రకరకాలుగా నల్లకుబేరులు బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారు. మరి ఇంత చేసి, ఇన్ని కోట్ల మందిని ఇబ్బంది పెట్టి సాధించింది.. సాధించబోతోంది ఏమిటో? ఆయనకే తెలియాలి. చూద్దాం మోదీ చెప్పిన 50 రోజుల్లో ఏం జరుగుతుందో?

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
ఇష్టానుసారంగా జిల్లాలు... బ్రతిమాలినా-బెదిరించినా-రాజీనామా చేసినా చాలు
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే
రాహుల్ పై కరుణ ఆగ్రహం

Comments

comments