కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు

What Narendra MOdi said about currency notes

ప్రధాని నరేంద్ర మోదీ భారత జాతినుద్దేశించి మాట్లాడుతూ, సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒక వెలుగు రేఖ అని ఐఎంఎఫ్‌ చెప్పిందని అన్నారు. అలాంటి భారతదేశానికి సరైన దిశానిర్ధేశం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశం నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపదను అక్రమ మార్గాల్లో కూడగట్టారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఎంతో మంది నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని, అయితే వారంతా సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. వారందరికీ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీతో జీవిస్తున్నాడని ప్రధాని కితాబునిచ్చారు. అధికారం అనుపానులు తెలిసినవాళ్లు మాత్రమే అత్యధికశాతం అవినీతికి పాల్పడతున్నారని ఆయన స్పష్టం చేశారు.

దీనిని ఆసరాగా చేసుకున్న ఉగ్రవాద సంస్థలు 500, 1000 రూపాయల దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని ఆయన తెలిపారు. దేశంలోని అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. అయితే వారిని పూర్తిగా అరికట్టాలంటే వారి ఆర్థిక మూలలపై బలమైన దెబ్బతగలాలని ఆయన చెప్పారు. అందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. అందులో భాగంగా తాము కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి 500 రూపాయలు, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నామని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం అమలులో కీలక సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే ఆ సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

ఈ ప్రయోగం సఫలమవుతుందని భావిస్తున్నామని, విఫలమైతే పాఠాలు నేర్చుకుంటామని ఆయన చెప్పారు. రద్దు చేస్తున్న 500 రూపాయలు నోట్లు, 1000 రూపాయల నోట్లు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకు బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో మార్చుకోవచ్చని ఆయన సూచించారు. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాలతో ఆ డబ్బును డిసెంబర్ లోపు మార్చుకోలేని వారికి మార్చివరకు అవకాశం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆన్ లైన్ లావాదేవీలు, ఆన్ లైన్ కొనుగోళ్లు, చెక్కులపై ఎలాంటి నియంత్రణ లేదని ఆయన స్పష్టం చేశారు. నగదు లావాదేవీలపై మాత్రమే నియంత్రణ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే నగదు డ్రాపై వారానికి గరిష్ఠంగా 20 వేల రూపాయల పరిమితిని విధిస్తున్నట్టు తెలిపారు.

రోజుకు గరిష్ఠంగా పది వేల రూపాయల విత్ డ్రాను మాత్రమే అనుమతించనున్నట్టు కూడా ఆయన తెలిపారు. దీంతో నేటి అర్ధరాత్రి నుంచే 500, 1000 రూపాయల నోట్ల ముద్రణను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. నవంబర్ 12 వరకు 500 లేదా 1000 రూపాయల నోట్లు మందుల షాపులు, రైల్వే, బస్, విమాన టికెట్ కౌంటర్లు వంటి అత్యవసరమైన ప్రాంతాల్లో మాత్రమే చెల్లుతాయని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లోనే పాత 500, 1000 రూపాయలు నోట్లు కలిగి ఉన్నవారి నుంచి 5000 రూపాయల వరకు మార్చుకునే అవకాశం కల్పించనున్నామని ఆయన తెలిపారు.

ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగం పనిచేయనుందని ఆయన తెలిపారు. ఈ మొత్తం విధానం పర్యవేక్షణకు కొత్తగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన ప్రకటించారు. అనంతరం రద్దు చేసిన కరెన్సీ స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను వాడుకలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తమ లక్ష్యమని ఆయన చెప్పారు. దేశ ప్రజల శ్రేయస్సుకే తామీ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
సైన్యం చేతికి టర్కీ
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
తెలంగాణకు ప్రత్యేక అండ
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
బాబు గారి అతి తెలివి
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
అకౌంట్లో పదివేలు వస్తాయా?
మోదీ హీరో కాదా?
దివీస్ పై జగన్ కన్నెర్ర
మోదీ హత్యకు కుట్ర... భగ్నం

Comments

comments