ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?

What should be done for Special Status

ప్రత్యేక హోదాపై తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? కొన్ని ఘాటు వ్యాఖ్యలతో పాటు చాలా అవసరమైన విషయాన్ని తెలిపారు కేటీఆర్.

ఇటీవల ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా, ఆ పరిస్థితిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అప్పుడు 5సం. కాదు 10 సం. ఇవ్వాలని చెప్పిన విషయాలను గుర్తుతెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తమకు అభ్యంతరంలేదు అని గతంలో చెప్పిన విషయంపైనే కట్టుబడివున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు రావాలని ఆకాంక్షించారు. అయితే పోరాడే విధానంలో లోపం ఉందని, ఏ రాజకీయ నాయకుడికిగాని ప్రభుత్వానికి గాని చిత్తశుద్దిలేదని తన అభిప్రాయాన్ని తెలిపారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనుగాని చూస్తే ఎవరికైనా ఇట్టే ఒక విషయం అర్థం అవుతుందని, అది కేవలం ఒకరిపై ఒకరు పట్టుసాధించే రాజకీయాలే చేస్తున్నారు తప్ప చిత్తశుద్దితో పోరాటాన్ని ప్రజలలోకి తీసుకొని ప్రయత్నం ఎవరూ చెయ్యట్లేదని విమర్శించారు.

చంద్రబాబు నాయుడుగారు కానీ, జగన్ మోహన్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరూ కూడా ప్రత్యేక హోదా వలన ఉపయోగాలు ఏంటి అని ప్రజలలోకి తీసుకెళ్లడం లేదు. ఎంతసేపు ఇక్కడొక మీటింగ్, అక్కడొక మీటింగ్ పెడుతున్నారే తప్ప ప్రజలను చైతన్యవంతులను చేసి వారితో ఉద్యమాలు చేయించే ప్రయత్నం జరగడం లేదు.

తెలంగాణ ఉద్యమం విషయంలో ప్రజలు వారికంతట వారే జిల్లాల వారిగా రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేశారు.

అలాగే ఆంధ్రప్రజలకు ప్రత్యేక హోదా పై పూర్తి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేసినట్లయితే తప్పక ప్రత్యేక హోదా సాధించవచ్చని తెలిపారు.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
అమిత్ షా రేస్ లో... తుస్
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
కోదండరాంపై నిఘా.. ఎందుకు.?
చంద్రబాబు నెంబర్ వన్..
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments