పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?

What Telangana cm KCR thinks about big notes ban

దేశం మొత్తం మోదీ జపం చేస్తోంది. నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో చాలా మంది ఇబ్బందిపడుతుండగా, దీర్ఘకాలిక లాభాన్ని తలుచుకుని అందరూ అడ్జస్ట్ అవుతున్నారు. పెద్ద నోట్లను మోదీ బ్యాన్ చెయ్యడంతో ఒక్కసారిగా దేశంలో సంచలనం రేగింది. కాగా తెలుగు మీడియాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,  మోదీ నిర్ణయంతో విభేదిస్తున్నారని వార్తలు వచ్చాయి. కేసీఆర్ బహిరంగంగా అనకపోయినా కానీ తన అనుయాయులతో మాత్రం స్పందించారని ఆ వార్త సారాంశం. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ బహిరంగంగానే మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

మోడీ నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడుతున్నారని, దాని వలన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తారుమారు అయ్యిందని, సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పరిస్థితి ఇలాగే మరికొంత కాలం కొనసాగినట్లయితే ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఖాయం అని కేసీఆర్ తన సన్నిహితులతో అన్నారని వార్త హల్ చల్ చేస్తోంది. అది ఒక దిక్కుమాలిన నిర్ణయం, దాని వలన దేశం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడినట్లు పేర్కొంది. కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని సంప్రదించకుండా, వాటికి తెలియజేయకుండా ఏకపక్షంగా ఇటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం చాలా తప్పని కనీసం ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యి దీనిపై చర్చించిన తరువాత నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని, కేసీఆర్ అభిప్రాయపడినట్లు పేర్కొంది.

ఈ కారణంగా రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తెరాస సర్కార్ వేసుకొన్న ప్రణాళికలన్నీ తారుమారు అయిపోయాయని ఆయన బాదపడ్డారని సాక్షి పేర్కొంది. కనుక త్వరలోనే దిల్లీ వెళ్ళి నోట్ల రద్దు తదనంతర పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సాక్షి పేర్కొంది. నోట్ల రద్దు వలన తెరాస సర్కార్ భారీగా ఆదాయం కోల్పోయిందని కానీ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించడంలేదని రెండు రోజుల క్రితమే కేటిఆర్ మీడియాకి చెప్పారు. మొత్తానికి నోట్ల మీద బ్యాన్ విధించడం వల్ల కేసీఆర్ నిజంగా అసంతృప్తిగా ఉన్నారో లేదో తెలియాలంటే మాత్రం ఆయనే అధికారికంగా ప్రకటన చేయాలి.

Related posts:
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఎందుకంటే భయమంట.. ఆ రిపోర్ట్‌లో ఏముంది?
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
ఏపి సిఎంగా నారా లోకేష్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments