జయలలిత మరణంపై నిజాలు తేలేనా?

What was the truth behind Jayalalitha's death

దేశం అభివృద్ధి చెందుతోంది.. అలా ఉంది. ఇలా ఉంది అని ఎన్ని డబ్బాలు కొట్టుకుంటున్నా, కొన్ని విషయాల్లో మాత్రం మనం ఇంకా వెనకబడే ఉన్నాము. అందులో గతంలో జరిగిన ఆరుషి హత్య దగ్గరి నుండి సత్యసాయి మరణం వరకు, తాజాగా జయలలిత మరణం వరకు నిజాలు ఇప్పటికీ నిగ్గుతేలడం లేదు. పురచ్చితలైవి జయలలిత మృతిపై ఎన్నో సందేహాలకు ఇప్పటికీ క్లారిటీ లేదు. అమ్మ మరణంపై సాక్షాత్తూ మద్రాస్ హైకోర్ట్ సైతం అనుమానాలు వ్యక్తం చేసింది. కేంద్రానికి జయ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసినా ఎందుకు గోప్యత పాటించిందని మందలించింది. అయితే కేంద్రానికి జయ ఆరోగ్యం గురించి, మృతికి కారణం గురించి నిజంగానే తెలుసా? తెలిసినా బయటపెట్టలేదా? గవర్నర్ ఇచ్చిన నివేదికలో ఏముంది అనేది హాట్ టాపిక్‌గా మారింది.

జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న ఆ 74 రోజులూ ఏం జరిగింది. ఆరోగ్యంగా వస్తారనుకున్న అమ్మ హఠాత్తుగా ఎందుకు చనిపోయారు. చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. అదే సందేహంతో ఆర్టీఐ కింద సమాచారం కోరాడో జర్నలిస్ట్. కేంద్ర హోంశాఖకు గవర్నర్ రాసిన నివేదికను బయటకు రప్పించాడు. జయలలిత మృతి తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు రాసిన లేఖ ఇదే. ఇందులో జయ ఆరోగ్య పరిస్థితి, చికిత్స తర్వాత మృతి చెందడం గురించి మూడు పేరాల సమాచారం ఇచ్చారు విద్యాసాగర్ రావు. అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు మొదట ఆస్పత్రికి వెళ్లినప్పటి నుంచి జయలలిత మృతి డిక్లేర్ చేసిన వరకూ తన నివేదికలో తెలిపారు.

జయలిలతను సెప్టంబర్ 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చారని… వారం తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని నివేదికలో పేర్కొన్నారు గవర్నర్. 50 రోజుల తర్వాత అమ్మ ప్రైవేటు రూమ్ లోకి షిఫ్ట్ కూడా చేశారన్నారు. రెండో పేరాలో డిసెంబర్ 4న తాను ముంబైలో ఉండగా జయలలిత కార్డియాక్ అరెస్ట్ అయ్యారని సమాచారం వచ్చిందన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉందనడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లానన్నారు. మూడో పాయింట్‌గా వైద్యులు ఆమెను ఎక్మోపై పెట్టారని.. తర్వాత పరిస్థితి విషమించి 5న రాత్రి పదకొండున్నరకు జయలలిత మృతి చెందారని తెలిపారు. అమ్మ మృతి తర్వాత తనను లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఎన్నుకున్నట్టు పన్నీర్ సెల్వం లేఖ కూడా ఇచ్చినట్టు గవర్నర్ కేంద్రానికి తెలిపారు.

డిసెంబర్ 12న జర్నలిస్ట్ సమాచారం కోరగా డిసెంబర్ 7న రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తమకు రాసిన రిపోర్ట్‌ను బయటపెట్టింది హోంశాఖ. జయలలిత మృతి చెందిన సమయం, కారణం కోరిన పిటిషనర్ కు అది కుదరదని తేల్చిచెప్పింది. గవర్నర్ తమకు హెల్త్ రికార్డ్స్ సమర్పించాడని తెలిపినా సెక్షన్ 8 వన్ యాక్ట్ 2005 కింద వాటిని మినహాయించామని.. సమాచారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో కేంద్రం దగ్గర జయ మృతిపై ఎలాంటి సమాచారం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హోంశాఖ నిర్ణయం జయ మరణాన్ని మిస్టరీగా మిగిల్చింది.

Related posts:
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
స్థూపం కావాలి
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
మోదీ హీరో కాదా?
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..
అప్పుడు చిరు బాధపడ్డాడట
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments