ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..

What will do with those two thousand rupee notes

కరెన్సీ కష్టాలు ఇంకా తీరలేదు. నవంబర్ 8వ తేదిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత జనాలకు మొదలైన కరెన్సీ కష్టాలు ఇప్పటికీ తీరడంలేదు. యాభై రోజులు ఓపిక పట్టండి ఖచ్చితంగా మీరు ఫలితాలను అందిస్తా అని మోదీ నాడు ఎమోషనల్ గా అంటే అందరూ సరే అనుకున్నా కానీ ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు నగదు కోసం పడిగాపులు కాయాల్సి వస్తుండటం మాత్రం కోపం తెప్పిస్తోంది. అయితే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత జరుగుతున్న పరిణామాలు, పర్యవసానాలు పక్కనబెడితే తాజాగా మరోసారి రెండు వేల నోటును ఎలా తీసివెయ్యబోతున్నారు అనేదానిపై ఓ వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

500, 1000 నోట్లను ఒక్కసారిగా రద్దు చేసేసిన తర్వాత.. హఠాత్తుగా ఏర్పడిన కొరతను పూడ్చడానికి డిమాండ్ – సప్లయి సూత్రాన్ని అనుసరించి మాత్రమే 2000 నోటును తీసుకువచ్చినట్టు ఇండియా టుడే న్యూస్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలు గురుమూర్తి వెల్లడించారు. క్రమంగా.. 2000 రూపాయల నోట్లను బ్యాంకుల్లోనే ఉంచేసుకుని, ప్రజలకు చిల్లర నోట్లు ఇవ్వాల్సిందిగా.. బ్యాంకులనే ఆదేశించడం జరుగుతుందని కూడా ఆయన తన అంచనాను వివరించారు.

ఆర్ బి ఐ తమ వద్దకు వచ్చిన 2000 నోట్లను తిరిగి ఇవ్వవద్దని బ్యాంకులకు ఆదేశిస్తారు. క్రమంగా వారి వద్ద 2000 నోట్ల నిల్వ పెరుగుతుంది. అవి తెచ్చిన ప్రజలకు చిల్లర నోట్లను ఇస్తారు. ఆ రకంగా క్రమేణా ప్రభుత్వం బహుశా 2000 నోట్లను అధికారికంగా రద్దు చేయడం వంటి నిర్ణయం తీసుకోకుండానే.. క్రమేపీ వాటిని చెలామణీకి దూరం చేసేస్తుందని ఓ వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంటే పెద్దనోట్లు ఒక్కసారి బ్యాంకుకు వెళితే ఇంక అవి బయటకు రావు.. అలా క్రమంగా రెండు వేల నోటును తగ్గించుకుంటూ చివరకు దాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
హరీష్.. ఇది నీకు సరికాదు
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
‘స్టే’ కావాలి..?
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
అంత దైర్యం ఎక్కడిది..?
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
జియోకే షాకిచ్చే ఆఫర్లు
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
మంత్రుల ఫోన్లు బంద్
దిగజారుతున్న చంద్రబాబు పాలన
చంద్రబాబు చిన్న చూపు
తిరిగిరాని లోకాలకు జయ
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
బాబును వదిలేదిలేదు
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
పవన్ పంచ ప్రశ్నలు
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
మంత్రి గంటా ఆస్తుల జప్తు
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments