దీక్షల వల్ల వచ్చేదేముంది..?

Deeksha

మనది భారతం… మహోన్నత భారతం. శాంతి మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించిన గడ్డ. అలాంటి చరిత్రకలిగిన గడ్డ మీద దీక్షల వచ్చేదేమీలేదు అని ఓ నేత అన్న మాటలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా జనసేన అధినేతగా పవన్ ఎంట్రీ ఇచ్చి.. చాలా కాలానికి పెట్టుకున్న తిరుపతి సభలో ఆయన మాట్లాడిన మాటలు.. ముఖ్యంగా దీక్షలపై ఆయన మాటలను బట్టి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం పవన్ కు ఎంతో అవసరం అని చాలా మంది అనుకుంటున్నారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమంటైంలో కేవలం అహింసా అనే ఆయుధాన్ని వాడారు గాంధీ. అలాంటి గాంధీ తెల్లవాళ్లకు చెమటలు పట్టించింది… మన స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రతి భారతీయుడి నరనరాన ఎక్కించింది కేవలం గాంధీ దీక్షల ద్వారానే తన లక్ష్యాన్ని, జాతి లక్ష్యాన్ని నెరవేర్చాడు. నాడు గాంధీ నుండి మొన్నటి తెలుగువారి గౌరవాన్ని దిల్లీ స్థాయిలో నిలిపిన తెలుగు తేజం సీనియర్ ఎన్టీఆర్ వరకు దీక్షల ద్వారానే చాలా సాధించారు. ట్యాంక్ బండ్ పై చేసిన దీక్ష ఒక్కసారిగా తెలుగు ప్రజలను కలవరపెట్టింది. అధికారులకు చెమటలుపట్టించింది.

తెలుగు నేల మీద కూడా దీక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో తన దీక్ష ద్వారా ఉద్యమ పంథాను మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందిరా పార్క్ వేదికగా ఎన్నో దీక్షలుసాగాయి.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీక్షలు అనేవి ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులకు తమ డిమాండ్లను, బాధను విన్నవించే పద్దతి.
మరి అలాంటి దీక్షలపై పవన్ దీక్షల వల్ల అసలు ఏమీ రాదు.. రోడ్ల మీదకు రావాల్సిందే అని పిలుపునిచ్చారు. రోడ్ల మీదకు రావడం, రాకపోవడాన్ని పక్కనబెడితే దీక్షల ప్రయోజనాలను మాత్రం పవన్ గుర్తించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా దీక్షల వల్ల వచ్చేదేమీ లేదు అని పరిణతిలేని మాటలు మాట్లాడటం పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది.  పొలిటికల్ గా పవన్ జగన్ చేసే దీక్షలపై అన్నా అనకపోయినా దీక్షల గురించి తక్కువగా మాట్లాడటం అనేది ప్రజాస్వామ్య పద్దతితో పోరాటాలకు  విరుద్ధం.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మంటలు
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
పవన్ మాస్టర్ స్కెచ్
ఆ అరుపులేంటి..?
బాబు Khan
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
కాపు ఉద్యమం+ప్రత్యేక హోదా ఉద్యమం - చంద్రంబలి
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
ఒక్క అడుగు.. అదే బాటలో జననేత
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
ఈ దారుణాన్ని అడ్డుకునేదెవరు?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?

Comments

comments