57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?

what will happend to those 20 MLAs

ఏపిలొ రాజకీయం రంజుగా సాగుతోంది. తెలుగుదేశం, వైసీపీ పార్టీల మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధంలో తెలుగుదేశం పార్టీ వైసీపీకి చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలను తన వైపుకు లాక్కుంది. ఈ పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలు ప్రజా ప్రయోజనాల దృష్యా పార్టీ మారామని, ప్రజలకు మంచి చెయ్యడానికే ఇలా చేశామని చెప్పుకొస్తున్నారు. కానీ వైసీపీ పార్టీ వాళ్లు మాత్రం వీళ్ల గురించి వేరేలా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యేలు చంద్రబాబు విధానాలు నచ్చి వెళ్లలేదని, చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసిన భారీ ప్యాకేజ్ కు ఆశపడి పార్టీ మారినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా కానీ పార్టీ మారారు.. కండువా కూడా మార్చుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చిన 57లో 20తో వారిలో కలవరం మొదలైంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి వచ్చే స్థానాలు కేవలం 57 సీట్లు అని నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి నిర్వహించిన సర్వేలో తేలింది. కాగా ఇప్పుడు ఆ 57లో ఈ 20 మంది ఉన్నారా..? అనే దానిపై చర్చ సాగుతోంది. వైసీపీ పార్టీ నుండి వచ్చిన వారికి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి సముచిత స్థానం లభించలేదు. దేవినేని నెహ్రూ, భూమన, జలీల్ ఖాన్ లాంటి వాళ్లు అయితే మంత్రి పదవులు దక్కుతాయని పార్టీ మారారు. కానీ పరిస్థితి మాత్రం అలా లేదు. అయితే ఇప్పటి సంగతి దేవుడికి తెలిసినా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని వదిలిన వారి పరిస్థితి ఏంటా అని అందరూ ఆలోచిస్తున్నారు.

ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 57 సీట్లు మాత్రమే వస్తే అందులో వైసీపీ నుండి జంప్ అయిన 20 మంది ఉంటే వారి పరిస్థితి ఏంటి..? ముందుగా తెలుగుదేశంలో వారు ఉన్నా కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండాపోతుంది. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలాగూ ప్రతిపక్ష పార్టీగా సెటిల్ కావాల్సి వస్తుందని నారా బ్రాహ్మణి సర్వే తేల్చింది. అలాంటప్పుడు గెలిచినా కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. పోనీ 57లో ఆ 20 మంది ఉండకపోతే పరిస్థితి ఏంటి? అని అనుకుంటే ఇటు పార్టీ మారిన తెలుగుదేశం పార్టీ నుండి కూడా వారు గెలవకపోతే, వీడిన పార్టీలోకి తిరిగి వెళ్లలేని పరిస్థితి. జగన్ ఇప్పటికే క్లీయర్ గా ఓ ప్రకటన చేశారు. తనకు క్యారెక్టర్ చాలా ముఖ్యం అని, ఎప్పుడూ అమ్ముకోలేదని తేల్చేశారు. నమ్ముకుంటే ఎక్కడిదాకా అయినా వెళ్లే జగన్.. తిరిగి వీళ్లు పార్టీలోకి వస్తామన్నా ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఎవరూ ఊహించలేని పరిస్థితి.

తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్న ఈ జంపింగ్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ‘57లో 20’ భయాన్ని పుట్టిస్తోంది. కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటి నుండే వైసీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని తెలిసింది. అయితే మొత్తానికి జంపింగ్ ఎమ్మెల్యేలు అప్పుడు చంకలు ఎగరేసుకుంటూ పార్టీ మారినా కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి దారుణంగా మారింది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందాన తయారైంది. అవకాశవాదరాజకీయాలు చేసే వారికి ఇలాంటి పరిస్థితి తప్పదు అనే మాట కూడా వినిపిస్తోంది.

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
రాజన్‌కు మోదీ ముళ్లకిరీటం
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
కాశ్మీర్ పై నెహ్రూ నిర్ణయం అప్పుడు ఒప్పు.. ఎప్పటికీ తప్పు
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
పవన్ ను కదిలించిన వినోద్
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పట్టిసీమ వరమా..? వృధానా..?
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా లాభాలు
అదీ హామీ అంటే.. ఫీరీయింబర్స్మెంట్ 100శాతం
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments