పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?

What will Pak loose and India gain after Battle

What will Pak loose and India gain after Battle.For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

దశాబ్దాలుగా సాగుతున్న యుధ్ధమే.. దాయాది దేశాలు దాడులకు దిగుతున్న విషయం ప్రపంచం మొత్తం తెలుసు. భారత్ ఓ పక్క అన్ని రంగాల్లో దూసుకెళుతుంటే.. ఉగ్రవాదం, మతఛాందసవాద సంకిళ్ల మధ్యన పాకిస్థాన్ చిక్కుకుంది. తన అభివృద్ధి మీద దృష్టిసారించడం కాకుండా పక్క దేశం అభివృద్ధి మీద ఏడుపు పాకిస్థాన్ నైజం. ఎల్ఓసీకి దగ్గరలోని, రక్షణపరంగా ఎంతో కీలకమైన ఉరీ ప్రాంతంలో ఉగ్రదాడులకు పాల్పడిన పాకిస్థాన్ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.

జమ్ము- ముజఫర్ నగర్ హైవేపై గల ఉరీ పట్టణాన్ని ఆనుకుని నిర్మించిన సైనిక స్థావరానికి మూడువైపులా(5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో) సరిహద్దు(ఎల్ వోసీ) ఉంటుంది. దీనిని అనుకూలంగా మలుచుకుంటున్న ఉగ్రవాదులు అప్పుడప్పుడూ ఉరీ ఆర్మీ క్యాంప్ పై దాడులకు తెగబడుతున్నారు. నేరుగా ఉరీ ఆర్మీ క్యాంప్ వైపునకు దూసుకొచ్చిన ఉగ్రవాదులు విచ్చలవిడిగా దాడులకు పాల్పడ్డారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే మొత్తం నాశనం అయిపోయింది. పాకిస్థాన్ ఇలా దొంగదెబ్బ తియ్యడం ఇది మొదటిసారి కాదు.. ఆఖరుసారి అంతకన్నా కాదు.

ఇప్పుడు ఏంటి..?
భారత బలగాల మీద పాక్ చేసిన నీచమైన దాడికి యావత్ భారత్ రక్తం మరుగుతోంది. తన బిడ్డలను కోల్పోయిన భరత మాత కంట రక్తపు చుక్క కాశ్మీర్ లో పడింది. పాక్ నక్క బుద్ధికి జవాబు ఇచ్చే టైం దగ్గరపడింది అని ముక్తకంఠంతో ఘోషించింది యావత్ భారతం. ఒకటి కాదు రెండు కాదు వేల మంది పాక్ దొంగ దెబ్బలకు బలయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా పాక్ వక్ర బుద్ధి మార్చుకునే పరిస్థితిలో లేదు. భారత ఆర్మీ, మిగిలిన సైనిక బలం మొత్తం పాకిస్థాన్ మీద దాడులకు అనుమతులు కోరుతోంది. భారత్ ఇప్పటికే చాలా అవకాశాలనిచ్చిందని, కానీ వాటిని పాక్ చేతగానితనంగా భావించిందని ఇక మీదట మాటలతో కాకుండా తూటాలతో సమాధానమివ్వాలని వాదన వినిపిస్తోంది.

Also Read:   పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే

వాస్తవ పరిస్థితి ఏంటి..?
పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు భారత్-పాక్ సరిహద్దుల్లో కాచుకుకూర్చున్నాయి. మన సైనికులు కాస్త అలసటగా కూర్చున్న టైంలో మాటు వేసి తన ఉగ్రనైజంతో దొంగదెబ్బ తీశాయి. సరిహద్దులు దాటి మన సైనికులు ఏనాడు పాక్ లోకి కానీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని వివాదాస్పద ప్రాంతాల్లోకి కానీ కాలుపెట్టింది లేదు. కానీ పాక్ మాత్రం అధికారికంగా తన సైన్యంతో కాకుండా అనధికారికంగా ప్రేరేపిత ఉగ్రవాదులతో దాడులకు పాల్పడుతోంది. పఠాన్ కోట్ దాడి నుండి ఇప్పటి ఉరీ ఘటనకు కూడా అదే ఫార్ములాను వాడుకుంది పాకిస్థాన్.

భారత్ ఏం చెయ్యగలుగుతుంది..?
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఆయుధ సంపత్తికలిగిన దేశాల్లో ఒకటి. దేశ రక్షన విషయంలో చాలా పురోగతి చెందిన దేశం. ఆసియా ఖండంలో చైనా తర్వాత బలమైన సైనిక సామర్థ్యం కలిగిన దేశం. అణ్వాయుధాల దగ్గరి నుండి బ్రహ్మోస్ వరకు, మిస్సైల్స్ దగ్గరి నుండి ధృవ్ లాంటి క్షిపణుల వరకు సర్వఆయుధ సంపన్న దేశం. భారత సైనిక బలం ముందు, పాకిస్థాన్ ఏమాత్రం నిలువ లేదు. పాకిస్థాన్ దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు(ఒక్క అణ్వాయుధం తప్ప), సైనిక బలం మహా అయితే మూడు రోజులు మాత్రమే భారత్ ను నిలవరించగలవు. తర్వాత పాకిస్థాన్ కోసం పోరాడేందుకు సైనికులు ఉండరు.. వాడేందుకు ఆయుధాలు కూడా ఉండవు.

Also Read:   వాళ్లను వదిలేదిలేదు

పాకిస్థాన్ ఏం చెయ్యగలుగుతుంది..?
భారత్ మీద దాడులకు తెగపడ్డా కానీ భారత్ ముందు తమ సత్తా ఏంటో పాకిస్థాన్ కు బాగా తెలుసు. భారత్ నిజంగా దాడులకు పాల్పడితే పాకిస్థాన్ ముందుగా చేసేది చైనాను శరణుకోరడమే. భారత్ కు వ్యతిరేకంగా ఉన్న చైనా ముందు నుండి కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో భారత్ కు బాసటగా అమెరికా రంగంలోకి దిగాల్సి వస్తుంది. మరోపక్క పాకిస్థాన్ భారత సైనిక దాడికి నిలబడలేని సందర్భంలో ముందుగా వాడే ఆయుధం అణ్వాయుధం. ఇప్పటికే అణ్వాయుధాన్ని వాడేందుకు తాము వెనక్కి తగ్గేదిలేదు అని ప్రకటించింది. అలాగే ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద మూకల సహాయాన్ని కూడా పాకిస్థాన్ మూటగట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ భారత్ చేసే యుద్ధం తర్వాత పాకిస్థాన్ భూభాగంలో మనిషి ప్రతి నిమిషం ఆకలితో అలమటించిపోతాడు. తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండడానికి గూడు కరువవుతుంది.

యుద్ధం జరిగితే భారత్ కు వచ్చేదేమిటి..?
దాయాది పాకిస్థాన్ మీద ఎన్నో దశాబ్దాల కోపాన్ని లోలోపలే అణుచుకున్న భారత్ ఒకవేళ యుద్ధానికి దిగితే మనకూ కొంత నష్టం కలుగుతుంది అన్నది వాస్తవం. ప్రపంచ పటంలో భారత్ అభివృద్ధిలో దూసుకెళుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాల నుండి భారత్ కు పెట్టుబడుల పరంపరం కొనసాగుతోంది. మరి యుద్ధం, అశాంతి నెలకొన్న ఏ దేశానికి పెట్టుబడులు రావు(కేవలం యుద్ధం జరిగే టైంలో మాత్రమే). అలాగే మానవాభివృద్ధి కూడా దిగజారుతుంది. ఇన్నాళ్లు మనం కూడగట్టిన మంచి పేరు మార్కెట్ లో కాస్త తగ్గే అవకాశాలున్నాయి. అయినా ప్రాణం మీదకు వస్తే భారత్ అయితే వేరే దేశమైనా యుద్ధం చెయ్యకతప్పదు.

యుద్ధం జరిగితే పాక్ కు పొయ్యేదేమిటి..?
ప్రపంచ పటంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ ఉంది. అభివృద్ధి, ఆరోగ్యం లాంటివి అక్కడ కనిపించవు. పరిశ్రమలు పెద్దగా లేవు. ప్రపంచంలో పెట్టుబడులు పెద్దగా రాని దేశాల జాబితాలో పాక్ ఒకటి. ఇప్పటికే దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత మరోసారి పాక్ ను ఇరవయేళ్ల వెనక్కి తీసుకెళుతుంది. పాక్ యుద్ధంలొ తన యావత్తును కోల్పోతుంది. అయినా కానీ ఏమాత్రం తగ్గని పాక్ కు, అక్కడి ప్రజల భద్రత, అభివృద్ధి గురించి పెద్దగా పట్టింపులేదు. భారీ స్థాయిలో నష్టం కలుగుతుంది. ఇస్లామాబాద్, కరాచీ లాంటి నగరాలు నామరూపాలు లేకుండాపోతాయి. యుద్ధం వల్ల పాకిస్థాన్ మూడు తరాల వరకు నష్టపోతుంది. ప్రపంచపటం మీద పాకిస్థాన్ అనే దేశం మనుగడలో ఉండేది అని చరిత్రలో చెప్పుకోవాల్సి వస్తుంది.

భారత్ ఏం చేయబోతోంది..?
భారత్ ముందు నుండి శాంతికామకదేశం. యుద్ధంలో ఎదుటిపక్షం నుండి దాడులు జరిగినా, శాంతితో ఆలోచించే భూమి. అందుకే పాకిస్థాన్ మీదకు దేశం మొత్తం దాడులకు పాల్పడాలని డిమాండ్ వినిపిస్తున్నా కానీ సమయం కోసం ఎదురుచూస్తోంది. పాక్ దొంగదెబ్బ తీసిన దానికి తగిన ప్రతిఫలం అందుకోక తప్పదు అని ఇప్పటికే హెచ్చరికలు వచ్చాయి. ముందుగా అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటిరిని చెయ్యాలని భారత్ చూస్తోంది. ఉరి ఘటనపై ఆధారాలను పాకిస్థాన్ కు సమర్పించడంతో పాటు అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను ఏకాకిని చెయ్యాలన్నది ప్లాన్. అలాగే బలూచిస్థాన్ ను తన ఆయుధంగా భారత్ వాడుకోవచ్చు.

అదే భారత్ కు కవచం..
ముందు నుండి శాంతి మార్గాల ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారాలను భారత్ వెతుకుతోంది. పాకిస్థాన్ సమస్యను కూడా అలాగే పరిష్కరించేందుకు భారత్ అన్ని విధాల ప్రయత్నించింది. భారత్ మీద పాకిస్థాన్ ఎన్ని సార్లు దాడులకు పాల్పడినా కానీ తిరిగి వారి మీద యుద్ధానికి మాత్రం దిగలేదు.గతంలో కార్గిల్ యుద్ధంలో కూడా మన సైనిక శిబిరాల కోసం యుద్ధం చేశామే కానీ పాక్ ఆక్రమించిన భూభాగాల మీద ఇప్పటి వరకు యుద్ధం చెయ్యలేదు. మన సహనం, శాంతి దేశానికి కవచాలు. కానీ ప్రతిదానికి ఓ స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని మించితే మాత్రం పిల్లి కూడా పులిగా మారుతుంది.. మరి పులి మాత్రం ముడిచుకొని కూర్చుంటుందా.. పంజా విసిరితే అంతే..

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
తెలంగాణలో యుద్ధానికి ఆ వర్గం
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
చెట్టు చెట్టే.. చిరంజీవి చిరంజీవే.. రెండు నాలుకలు
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
ఏపిలో రాజకీయానికి నిదర్శనం వాచ్ మెన్ రాందాస్
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
ఇదే జగ‘నిజం’
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
ఉక్కిరిబిక్కిరి
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం
టిఆర్ఎస్ లో వర్గపోరు.. వరంగల్ నుండే
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments