ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?

Whats going in Tamilnadu

హాస్పిటల్ అంటే ఏముంటుంది….? ఎక్కడైనా డాక్టర్లు, పేషంట్లు ఉంటారు. కానీ ఓ హాస్పిటల్ దగ్గర మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. అక్కడ రాష్ట్ర మంత్రి వర్గం భేటీ అవడం, బయట ఏకంగా దేవాలయంలో ఎలా అయితే చేస్తారో అలా పూజలు, పునస్కారాలు చెయ్యడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సీన్ ఎక్కడా అనుకుంటున్నారా..? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న ఆస్పత్రి బయట. అసలు జయలలితకు ఏం జరిగింది..? అక్కడ పరిస్థితి ఎందుకు ఎవరికీ అంతుపట్టడం లేదు? ఇలాంటి అన్ని అంశాలను ఈ ఆర్టికల్ లో కవర్ చేశాం.

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం ఇంకా సీరియస్ గానే ఉంది. చెన్నై అపోలో ఆసుపత్రిలోవైద్యులు ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం జయను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జయకు .. సుదీర్ఘ కాలం చికిత్స అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్స్ బాలే …ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ .. జయ ఆరోగ్యం మెరుగుపడలేదు.

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జయను సింగపూర్ తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికీ దాని కోసం ఒక ఎయిర్ అంబులెన్స్ ను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం . రజనీకాంత్ , విజయ్ కాంత్ లు సింగపూర్ లో చికిత్స పొంది.. ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చారు. అందుకే మెరుగైన వైద్యం కోసం జయను కూడా సింగపూర్ తరలించాలని భావిస్తున్నారు. వైద్యబృందం సలహా మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

జయలలిత అనారోగ్యం అంటూ ముందుగా ఆస్పత్రికి వెళ్లారు. ముందు ఫీవర్ వచ్చింది.. డీహైడ్రేషన్ అని చెప్పారు. కానీ తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత మాత్రం వెంటిలేషన్ మీద ఉంచారు అనితెలిసింది. మొత్తంగా ఆమె అనారోగ్యంగా ఉంది అని మాత్రం క్లారిటీ ఉంది.

కాగా జయలలిత అనారోగ్యం కారణంగా అక్కడి పాలన గాడితప్పింది. జయ ఆరోగ్యంపై కోర్టులో ఇప్పటికే పిల్ దాఖలుకావడం, గవర్నర్ అక్కడి పరిస్థితిని ఆరా తియ్యడంతో రాజకీయంగా చాలా ఇంట్రస్ట్ క్రియేట్ అయింది. అసలు ఆస్పత్రిలో జయ పరిస్థితి ఎలా ఉంది..? అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. ఒక్కట మాత్రం తెలుస్తోంది. జయ ఆరోగ్యం బాగా లేదు.. చికిత్స పొందుతున్నారు. కానీ దీనిపై పార్టీలో మాత్రం రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. పార్టీలో నెంబర్ టూ ఎవరు అన్న దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. పార్టీకి చెందిన సెల్వమణి పేరు ముందుండగా, హీరో అజిత్ పేరు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

డిప్యూటీ సీఎం రేసులో పన్నీర్ సెల్వంతోపాటు సీనియర్ మంత్రి పళని స్వామి కూడా ఉన్నారు. గడిచిన 15 రోజులుగా సీఎం జయలలిత ఆసుపత్రికే పరిమితమైపోవడంతో పరిపాలనా పరమైన ఆదేశాల జారీలో ఆలస్యం నెలకొంటున్నది. జయకు అత్యంత ఆప్తుడైన ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావే అన్ని వ్యవహారాలను చక్కబెడుతున్నారు. కాగా మొన్నటి దాకా జయలలిత స్నేహితురాలు శశికళ మరోసారి తెర మీదకు వస్తుంది అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి చూడాలి తెర మీదకు ఎవరు వస్తారో..? ఏం జరుగుతుందో..? మరోపక్క షీలా బాలకృష్ణన్ ఇప్పటికే అమ్మ ప్లేస్ లో పాలన సాగిస్తోంది.

Also Read: అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?

రకరరకాల ప్రభుత్వ పథకాలతో తమిళనాడు ప్రజలకు అమ్మగా మారిన జయలలిత ఆరోగ్యం కోలుకోవాలని అక్కడి వారు విపరీతంగా పూజలు నిర్వహిస్తున్నారు. కొంత మంది అభిమానం, ఆరాధన ఎక్కువై రకరకాల చేష్టలు చేస్తున్నారు. ఒంటికి సూదులు గుచ్చుకోవడం, నాలుకకు సూలం గుచ్చుకోవడం, ఆస్పత్రి ముందు టెంకాయలు, గుమ్మడికాయలు కొట్టడం లాంటివి చేస్తున్నారు. మొత్తానికి తమిళనాడులో ఓ పక్క అమ్మ అభిమానులకు దినదినగండంగా ఉంటే.. రాజకీయ నాయకులకు కంటి మీద కునుకులేకుండా పోయింది. ఓ పక్క జయలలిత ప్లేస్ ఎవరు తీసుకుంటారు..? తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? అనే అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానమివ్వాలి. మరి చూడాలి ఏం జరుగుతుందో..!!

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
చెరువుల్లో ఇక చేపలే చేపలు
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
నారా వారి నరకాసుర పాలన
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
తెలంగాణ 3300 కోట్లు పాయె
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?

Comments

comments