ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?

Where is RBI Governor Urjith Patel

దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి.. దాని వల్ల కొంత మంది ఇబ్బందులు కలుగుతున్నాయి. మోదీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే దేశంలోని కోట్లాది మంది ఇబ్బందులుపడుతుండగా తాజాగా ఓ వ్యక్తి మీద మాత్రం చాలా వత్తిడి వస్తోంది. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే చాలా మంది, మోదీని నేరుగా టార్గెట్ చెయ్యకుండా ఆయనను టార్గెట్ చెయ్యడం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆ వ్యక్తి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు వార్తల్లో నిలుస్తున్నాయి. ఆ వ్యక్తి కనిపించడం లేదు అని ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్.

దేశంలో గత 15రోజులుగా ఆర్థిక సంచలనాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలో అందరికి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాగా నిజానికి మోదీ ప్రకటించిన నోట్ల రద్దు ప్రకటన ఆర్బీఐ పరిధిలోనిది. అందుకే ఇప్పుడు అందరూ ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ ను టార్గెట్ చేశారు. నవంబర్ ఎనిమది తర్వాత నుండి ఉర్జీత్ పటేల్ కనిపించకపోవడంపై సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా ఉర్జీత్ పటేల్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ వినిపించింది కానీ నేడు మాత్రం సోషల్ మీడియాలో కొత్త వార్త వచ్చింది. అదేమిటంటే..

పెద్దనోట్ల రద్దుపై అనంతరం ఉర్జిత్‌ మీడియాలో కనిపించకుండాపోవడంపై ఓ నెటిజన్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.  ‘మిస్సింగ్‌..  మీరు ఉర్జిత్‌ను చూశారా’ అంటూ ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఉర్జిత్‌ ఫొటో పెట్టి.. ‘ఉర్జిత్‌ పటేల్‌, వయస్సు 53 ఏళ్లు. చివరిసారిగా ఆర్బీఐ భవనం వద్ద కనిపించాడు. అన్నింటినీ క్షమించేశాం. దయచేసి ఇంటికి రా. ఎవరైనా ఆచూకీ చెబితే రివార్డు ఇస్తాం. దయచేసి 01123710538 నంబర్‌కు కాల్‌ చేయండి’ అంటూ మధు మీనన్‌ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కొంత మంది నెటిజన్లు బహుశా తాను చేసిన పెద్ద పొరపాటుకు చింతిస్తూ ఉర్జిత్‌ ఆత్మహత్య చేసుకొని ఉండి ఉంటాడని నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు కామనే అయినా కూడా ఈ రేంజ్ లో ఉంటాయని మాత్రం ఎవరూ ఊహించలేదు.

Related posts:
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
బాబోయ్ బాబు వదల్లేదట
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
నారా వారి అతి తెలివి
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
వంద, యాభై నోట్లు ఉంటాయా?
దివీస్ పై జగన్ కన్నెర్ర
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
పవన్ పంచ ప్రశ్నలు
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
ఏపికి యనమల షాకు

Comments

comments