నిప్పువా.. ఉప్పువా..? ఎవడడిగాడు

Who asked Chandrababu Naidu Nippu

చంద్రబాబు తనను తాను నిప్పు అనుకోవడం అందరికి తెలుసు. కానీ ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు నిప్పు అనడం ఖచ్చితంగా చాలా మందికి చికాకు కలిగిస్తుంది. ఇప్పుడు ఉండవల్లికి కూడా చికాకు తెప్పించింది.  ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీద మరోసారి విమర్శల వర్షం కురిపించారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ ను కాపాడతారు అనుకుంటే ఉదయం లేచింది మొదలు చంద్రబాబు నాయుడు తాను నిప్పు.. నిప్పు అంటూ ప్రకటన ఇచ్చుకుంటున్నారని మండిపడ్డారు ఉండవల్లి. రామోజీరావు, చంద్రబాబు నాయుడు అంటే కలలో కూడా సహించని ఉండవల్లి మరోసారి చంద్రబాబు నాయుడును మీడియా సాక్షిగా కడిగిపారేశారు.

‘‘రోజూ ఎందుకు చెప్పాలండీ.. రోజు నిప్పు నిప్పు అని ఎవడడిగాడు.  మీరు నిప్పా ఉప్పా, ఇవాళ మళ్లీ హెడ్డింగు..  ‘నేను నిప్పు నేను నిప్పు అని’.  అప్పుడే నమ్మే వాళ్లు నమ్ముతారు. నమ్మించడానికి కావాల్సిన వనరులు మీదగ్గర ఉన్నాయి. ఎందుకు ఈ నిప్పుగొడవ….. ఎందుకు..? మిమ్మల్నెవడు నిప్పనుకొని ఓటువెయ్యలేదు. మీకు అనుభవం ఉందని ఓటేశారు.. మీరు చెయ్యగలరు.. రాష్ట్రం క్రైసిస్ లో ఉన్నప్పుడు బయటకు తీసుకురావడానికి ఏదైతే ట్యాక్టిస్ ప్లే చెయ్యాలో ఆ ట్యాక్టిస్ ప్లే చేయగలిగే మెనోవర్ చెయ్యగలిగే క్వాలిటీలు మీకున్నాయి, మ్యానుప్లెషన్ క్వాలిటీలు మీకున్నాయనే మీకేశారు ఓటు. ఏం చేశారు ఇప్పటి వరకు ఈ రెండేళ్లలో పుష్కరాలు తప్ప. ఏం చేశారో చెప్పండి’’ అని ఉండవల్లి ఏకిపారేశారు. ఇక నుంచైనా చంద్రబాబు నాయుడు తనను తాను నిప్పు అని చెప్పుకోవడం మానేస్తారేమో చూడాలి.

Related posts:
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
సైన్యం చేతికి టర్కీ
తాగుబోతుల తెలంగాణ!
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
సన్మానం చేయించుకున్న వెంకయ్య
స్థూపం కావాలి
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
అంత దైర్యం ఎక్కడిది..?
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బాబు గారి అతి తెలివి
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
నారా వారి నరకాసుర పాలన
మావో నాయకుడు ఆర్కే క్షేమం
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ

Comments

comments