ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు…?

Who Gave ranks to KCR and Chandrababu for their Chief Ministries

నోటికొచ్చింది వాగెయ్యడం… చేతికొచ్చింది రాసెయ్యడం మన వాళ్లకు బాగా అలవాటు. అందుకే అన్నింటిలోనూ మన వాళ్లు అతిగా చేస్తుంటారు. తెలుగు మీడియా గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. ఆకాశంలో గద్దకు ఎన్ని ఈకలున్నాయో కూడా చెప్పేస్తారు. తాజాగా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరును బట్టి ర్యాంకులిచ్చారని ప్రచారం నడిచింది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సిఎంలకు కూడా ర్యాంకులివ్వగా కేసీఆర్ ముందు వరుసలో నిలిచి నెంబర్ వన్ సిఎంగా ఎదిగారని, చంద్రబాబు నాయుడు మాత్రం వెనకబడిపోయి పదమూడో ర్యాంకును సొంతం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. అసలు ఆ ర్యాంకులు ఎవరిచ్చారు.. అన్నది.

ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు అసలు ఏమీ లేని దగ్గర పెద్ద సినిమానే చూపించారు మీడియా మిత్రులు. సిఎం కేసీఆర్ నెంబర్ వన్ సిఎంగా ప్రధాని మోదీ దిల్లీలో జరుగుతున్న ఇంటర్ స్టేట్ కౌన్సిల్ లో ప్రకటిస్తారని తెగ ప్రచారం నడిచింది. కానీ నిజానికి అక్కడ సీన్ వేరేలా ఉంది. మోదీ కనీసం ర్యాంకులు అన్న మాట కూడా మాట్లాడలేదు. పోనీ.. కేసీఆర్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ దీని మీద స్పందించారా..? లేనే లేదు. కానీ మన పత్రికల్లో మాత్రం తాటికాయంత అక్షరాలతో నెంబర్ వన్ సిఎం అని, పదమూడో ర్యాంక్ అని రాసేశారు.

అసలు మోదీ గానీ, కేంద్రం గాని ఎందుకు ర్యాంకులను ప్రకటిస్తుంది..? ర్యాంకులను అధికారికంగా ప్రకటిస్తున్నట్లు వార్తలైనా వచ్చాయా.?లేనే లేదు. కానీ శూన్యంలో టార్చిలైట్ వేసి మరీ కొత్త ఆవిష్కణను కలలో చూపిస్తున్నారు. ఇక కొంత మంది మీడియాలోని భజన బృందం చేస్తున్న హడావిడి అయితే అంతా ఇంతా కాదు.మీడియా ముందుకు వచ్చిన వీరాభిమానులు అయితే తొడలుకొట్టి సవాల్ అంటూ ఛాలెంజ్ చెయ్యడమొక్కటే లేదు. కొన్ని మీడియా ఛానల్స్ అయితే పలానా ఆయన అలా, పలానా ఈయన ఇలా అంటూ వార్తలు ప్రచురించాయి, ప్రసారం చేశాయి.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అద్భుతాలు జనాలకు మంచి చేస్తున్నాయని, మీడియాలో డబ్బా ఎక్కువ కొట్టేస్తున్నాయి మీడియా ఛానల్స్. నిజానికి తెలంగాణ ప్రభుత్వం కన్నా అద్భుతమైన పథకాలను తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తోంది. అక్కడ ప్రతీదానిలో ప్రభుత్వం తోడ్పాటు ఉంటుంది. మరి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసే పరంగా చూస్తే తమిళనాడుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి… జయలలితకు నెంబర్ వన్ ర్యాంక్ రావాల్సి ఉంది.

అలా కాదు సంక్షేమ పథకాలను కాకుండా అవినీతిని ఆధారంగా చేసుకొని.. ర్యాంకులు ఇచ్చారు అని అనుకుంటే అలా కూడా కాదు. అవినీతిని నిర్మూలించడంలో దిల్లీ సర్కార్ ఎన్నో స్టెప్ లు ముందుకేసింది. దాంతో అక్కడ దాదాపుగా అవినీతికి ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డుకట్ట వెయ్యాలో అన్ని రకాలుగా అడ్డుకట్ట వేస్తోంది. మరి అవినీతిని ఆధారంగా ర్యాంకులు వేశారు అనుకుంటే అప్పుడు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఫస్ట్ ర్యాంక్ రావాలి కదా.

రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ర్యాంకులను ప్రకటంచారు.. అనే దాని కన్నా ముందు అసలు దేని మీద ర్యాంకులను ప్రకటిస్తారు అనే ధ్యాస ఉండాలి. పలానా రాష్ట్రం అభివృద్దిపరంగా దూసుకెళుతోంది లేదా వెనకబడింది అని నిరూపించడానికి ఇది తీశారు అనుకుందాం. కానీ ఇప్పడు దీన్ని లెక్కలు వేసే టైం కాదు. ఆర్థికంగా ఎలాంటి అవసరం లేని టైంలో ఇలా అంటే అందరూ నవ్వుకుంటారు. బడ్జెట్  లేదంటే ఆర్థిక సర్వే చేస్తున్నప్పుడు ఇలా అన్ని రాష్ట్రాల లెక్కలు వేశారు అని అంటే దానికి అర్థం ఉంది కానీ ఇప్పుడు ఆ టైం కానేకాదు.

ఇక రాష్ట్రాల ఆర్థిక అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని ర్యాంకులు వేశారు అని అనుకుందామా అంటే అదీ కాదు. ఎందుకంటే తెలంగాణ, గుజరాత్, తమిళనాడు మినహా అన్ని కూడా వెనకబడ్డాయి. దిల్లీకి అయితే ఐదో ర్యాంక్ అనే ప్రచారం నడిచింది. మరి ఇలా సంబందంలేనివి అనుకొని మన వాళ్లే క్రియేట్ చేసిన ఓ ఊహ ఈ ర్యాంకులు. పోనీ మోదీ ఇలా చేశారా..? అంటే అసలు ఆయన తలుచుకుంటే అధికారికంగా రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై వివరాలను సర్వేలో తెలుసుకుంటారు. అంతేకానీ ఎవరో చేశారని చెబుతున్న దానిని మోదీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. అంతకన్నా ఆధారాలు కూడా లేకుండా వచ్చిన వార్తలను మీడియాలో ప్రచారం చెయ్యడం, వాటిని ప్రజలు కూడా నిజమే కదా అని అనుకోవడం చాలా తప్పు.

 

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
ఆ రెండు బాణాలు మోదీ వైపే..?
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
ఇదే జగ‘నిజం’
సింధూరంలో రాజకీయం
పవన్ మాస్టర్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
టాప్ గేర్ లో ముద్రగడ
పట్టిసీమ వరమా..? వృధానా..?
వెనకడుగు
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
స్విస్ ఛాలెంజ్ కు హైకోర్టు స్టే.. చంద్రబాబుకు షాక్
ప్రత్యేక హోదా లాభాలు
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
నారా వారి ఆస్తులు.. నమ్మలేని లెక్కలు
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
రాత్రే మోదీ ‘నోట్ల’ ప్రకటన ఎందుకు?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు

Comments

comments