ఎవరు చాణిక్యులు..?

Who Is Chanukya Among These

ఏపీ రాజకీయాలను దగ్గరగా చూస్తే.. ఓ నలుగురు కలిసి రాజకీయ చదరంగం ఆడుతున్నట్లు ఇట్టే కనిపెట్టొచ్చు. ఈ చదరంగంలో ఎవరు చాణిక్యుడు అన్నది ప్రశ్న. ఎవరికీ వారే ధీటుగా రాజకీయ చాణిక్యుని ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు. చివరికి ఎవరు విజేత అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ఈ నలుగురు ఆడుతున్న రాజకీయ చదరంగంలోని అడుగులను ‘తెలుగోడ’ మీకోసం వివరిస్తోంది.

చివరికి ఎవరు గెలవచ్చన్నది కొంతమేర ఊహించగలిగినా.. ఖచ్చితంగా చెప్పలేం. అయితే.. మధ్యలో వారివారి రాజకీయ చాణిక్యతను చాటుతుండడం వల్ల కొన్ని గంటలు, కొన్ని రోజుల వరకు మాత్రం ఎవరో ఒకరు ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. ఈ రకంగా ప్రతిఒక్కరూ, ప్రతిసారీ మధ్యలో విజేతగా నిలుస్తున్నారు. వారివారి వీరాభిమానులకు కొంత ఊరట, గర్వించదగ్గ విధంగా చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్‌ని తీసుకున్నట్లయితే.. సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఇప్పట్లో రాజకీయాల జోలికి రారు అనుకుంటున్న తరుణంలో సడెన్‌గా వచ్చి తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్ చేస్తున్న ప్రత్యేక హోదాని హైజాగ్ చేశారు జనసేన పార్టీ తరఫున తన మూడెంచెల పోరాట ప్రణాళికతో.

జగన్ ఎవరూ ఊహించని విధంగా తన వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణతో చంద్రబాబు నాయుడి ఓటుకు నోటు కేసును తిరగదోడించారు. దీనికి దిమ్మతిరిగిన చంద్రబాబు హైకోర్టుకు వెళ్ళి రామకృష్ణ వేసిన పిటిషన్ తాలుకా విచారణ ఆదేశాలపై స్టే తెచ్చుకోగలిగారు.

మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యేక హోదాపై ఏమీ తేల్చకుండా నాన్చుతూ వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న ఏపీ రాజకీయాల్ని చూసి.. ఇదే సరైన సమయం అనుకుని ఆకస్మికంగా ‘ప్రత్యేక హోదా లేదు.. ప్రత్యేక సహాయం మాత్రమే’నని అరుణ్ జైట్లీతో ప్రకటన చేయించారు.

చంద్రబాబు నాయుడు స్టేతో ఊరట తెచ్చుకున్నప్పటికీ.. మూడురోజుల అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సమాధానం ఎలా చెప్పాలనుకుంటున్న తరుణంలో మోడీ చేసిన పనికి తాను ఈ ఓటుకు నోటు కేసు ఒత్తిడి నుండి సునాయాసంగా తప్పించుకోగలిగారు.

జగన్ హైజాగ్ అయిన తన ప్రత్యేక హోదా పోరాటాన్ని పవన్ దగ్గర నుంచి లాక్కొని తన పట్టాలెక్కించుకున్నారు రాష్ట్ర బంద్‌కి పిలుపునివ్వడం ద్వారా.

దీన్ని బట్టి.. ఎవరు చాణిక్యులో అన్నది మీరే ఊహించుకోండి!

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
జీఎస్టీ బిల్ కథ..
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
చిరుకు పవన్ అందుకే దూరం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
ఆ అరుపులేంటి..?
జనసేన పార్టీ (తెలుగుదేశంలో ఓ డివిజన్)
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
రక్తం మరిగింది అన్నారు.. ఎందుకు కరిగిపోయారు?
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
ఇక యుద్ధమే కానీ..
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
పిట్టల దొరను మించిన మాటల దొర
ఏలూరు వెనక ఇంత కథ ఉందా?
వర్షాలు పడితే సిఎంలు చనిపోతారా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
పైసలు వసూల్ కాలేదుగా..
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్

Comments

comments